పా.రంజిత్.. గత పది పదిహేనేళ్లలో తమిళ నుంచి వచ్చిన గొప్ప దర్శకుల్లో ఒకడు. తొలి సినిమా ‘అట్టకత్తి’తో మొదలుపెట్టి ‘తంగలాన్’ వరకు అతను విభిన్నమైన సినిమాలు తీశాడు. కేవలం రెండు సినిమాల అనుభవంతో సూపర్ స్టార్ రజినీకాంత్‌తో సినిమా చేసే అవకాశం అందుకుని వరుసగా ఆయనతో కబాలి, కాలా లాంటి వైవిధ్యమైన చిత్రాలు అందించాడు రంజిత్.
కాకపోతే ఈ సినిమాలు అంచనాలను అందుకోలేకపోయాయి. రంజిత్ దాదాపుగా ప్రతి సినిమాలోనూ కుల వివక్ష చుట్టూనే కథలను నడిపిస్తుంటాడన్న సంగతి తెలిసిందే. రంజిత్ నిర్మాత అవతారం ఎత్తి పరిచయం చేసిన మారి సెల్వరాజ్ సైతం.. తన బాటలోనే సాగుతున్నాడు. మరోవైపు అగ్ర దర్శకుడిగా ఎదిగిన వెట్రిమారన్ సినిమాల్లో సైతం ఈ పాయింట్‌ను హైలైట్ చేస్తుంటాడు. ఐతే ఇలాంటి సినిమాలు తీస్తున్నందుకు తమను నిందించడాన్ని పా.రంజిత్ తప్పుబట్టాడు.
తాము తమిళ సినిమాను వెనక్కి తీసుకెళ్తున్నామని కొందరు విమర్శలు చేస్తున్నారని.. కోలీవుడ్ నుంచి భారీ వసూళ్లు సాధించే సినిమాలు రాకపోడానికి తామే కారణం అనడం అన్యాయమని అతను మండిపడ్డాడు. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రంజిత్ నిర్మించిన ‘బైసన్’ సినిమా సక్సెస్ మీట్లో రంజిత్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘‘కాంతార లాంటి సినిమా పెద్ద సక్సెస్ అయిందంటే చాలు.. తమిళంలో ఇలాంటి చిత్రం రాలేదని అంటారు. మన దగ్గర ఇలాంటి భారీ వసూళ్లు సాధించి సినిమా ఏది అంటారు. వెంటనే నాలాంటి దర్శకులను టార్గెట్ చేస్తారు. నేను ఇన్నేళ్లలో ఏడు సినిమాలు మాత్రమే చేశాను. మారి సెల్వరాజ్ ఐదు సినిమాలే తీశాడు. వెట్రిమారన్ కూడా మూడేళ్లకు ఒక సినిమానే తీస్తాడు.
కానీ మా ఫొటోలు పెట్టి తమిళ సినిమా మా వల్లే వెనుకబడిపోయిందని అంటారు. సంవత్సరానికి తమిళంలో 250-300 సినిమాలు తీస్తారు. గత రెండేళ్లలో 600 సినిమాలు వచ్చాయి. మరి ఈ సినిమాలేవీ ఎందుకు అంత పెద్ద సక్సెస్ కాలేదు. మిగతా దర్శకులంతా ఏం చేస్తున్నారు. తమిళ ప్రేక్షకులు ఈ సినిమాలను ఎందుకు ఆదరించలేదు. ఎందుకు పెద్ద సక్సెస్ చేయలేదు. మమ్మల్నే ఎందుకు అంటున్నారు’’ అని పా.రంజిత్ ప్రశ్నించాడు.
This post was last modified on October 27, 2025 12:52 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…