ఒక రీ రిలీజ్ సినిమా కోసం దేశమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూడడం బహుశా తొలిసారి జరుగుతుండొచ్చు. ఈ నెల 31న విడుదలయ్యే బాహుబలి: ది ఎపిక్ పట్ల అంతకంతకూ ఆసక్తి పెరిగిపోతోంది. మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి విజువల్ వండర్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి.. బాహుబలి రెండు భాగాలను కలిపి ఒకటిగా రిలీజ్ చేయాలన్న సరికొత్త ఆలోచనతో మరోసారి ట్రెండ్ సెట్ చేశారు.
ముందు బాహుబలిని ఒక్క సినిమాగానే తీయాలనుకున్నారు కాబట్టి.. అలా తీసి ఉంటే ఎలా ఉండేదో ఈ నెల 31న ప్రేక్షకులు చూడబోతున్నారు. ఐతే రెండు సినిమాలను కలిపి ఒకటిగా చేసే క్రమంలో చాలా సీన్లు కట్ చేస్తారన్న విషయం తెలిసిందే. పాటలు, సన్నివేశాలు కలిపి దాదాపు గంటన్నర దాకా కట్ అయిపోతుంది. మరి కొత్తగా సినిమాలో సన్నివేశాలు ఏమైనా ఉంటాయా అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. దీనికి ఔనని సమాధానం చెప్పాడు బాహుబలి సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్.
బాహుబలి రీ రిలీజ్ నేపథ్యంలో సెంథిల్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఈ నెల 31న ఎపిక్ రిలీజ్‌లో కొత్త సన్నివేశం ఒకటి చూస్తారన్నాడు. ఐతే ఈ సన్నివేశం కొత్తగా షూట్ చేసిందేమీ కాదని అతను చెప్పాడు. ఎడిటింగ్ టైంలో కట్ అయిపోయిన ఒక సన్నివేశాన్ని ఇప్పుడు సినిమాలో కలుపుతున్నారని.. అది కథలో కీలకంగానే ఉంటుందని సెంథిల్ చెప్పాడు. ఈగ తర్వాత బాహుబలి కథ చెప్పినపుడే ఇదొక విజువల్ వండర్ అనే విషయం అర్థమైందని.. అందుకు తగ్గట్లుగా ఒక సినిమాటోగ్రాఫర్‌గా సన్నద్ధం అయ్యానని సెంథిల్ చెప్పాడు.
ముందు ఈ సినిమాలోని కొన్ని సీన్లను ఔట్ డోర్ లొకేషన్లలో తీద్దామనుకున్నామని.. అలాగే ఒక సీన్ తీశామని.. కానీ కెమెరా ఎక్కడ పెట్టినా.. ఏదో ఒక చోట జనం కనిపించేవారని.. దీంతో ఇలా సాధ్యం కాదు అని రామోజీ ఫిలిం సిటీలోనే చాలా వరకు సినిమాను చిత్రీకరించామని సెంథిల్ కుమార్ వెల్లడించాడు. ఆర్ఆర్ఆర్ వరకు రాజమౌళితో సాగిన సెంథిల్ కుమార్.. ప్రస్తుతం బ్రేక్ తీసుకున్నాడు. మహేష్ బాబు సినిమాకు పి.ఎస్.వినోద్ ఛాయాగ్రహణం అందిస్తున్నాడు.
This post was last modified on October 27, 2025 11:37 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…