మాస్ మహారాజా కొత్త సినిమా ‘మాస్ జాతర’ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. చివరికి అక్టోబరు 31న ఈ చిత్రాన్ని విడుదల చేసి తీరాలని నిర్ణయించారు. ఇన్నిసార్లు సినిమా వాయిదా పడడంపై తమ మీద తామే సెటైర్లు వేసుకుంటూ కొన్ని రోజుల కిందట ఒక వీడియో కూడా చేసింది ‘మాస్ జాతర’ టీం. ఆ సందర్భంలోనే అక్టోబరు 31న సినిమా పక్కాగా విడుదలవుతుందని నొక్కి వక్కాణించారు.
కానీ తాజా సమాచారం ప్రకారం ఆ రోజు కూడా సినిమా రిలీజ్ కాదట. అలా అని ఆ సినిమా ఇంకొన్ని వారాలు వెనక్కి వెళ్తుందేమో అని సందేహించాల్సిన పని లేదు. అక్టోబరు 31నే ‘మాస్ జాతర’ షోలు పడనున్నాయి. కానీ అధికారిక రిలీజ్ మాత్రం నవంబరు 1న అని సమాచారం. 31న ఈ చిత్రానికి పరిమిత సంఖ్యలో పెయిడ్ ప్రిమియర్స్ వేయబోతున్నారు. తర్వాతి రోజు సినిమా పూర్తి స్థాయిలో విడుదలవుతుంది.
రాజమౌళి విజువల్ వండర్ ‘బాహుబలి: ది ఎపిక్’ ఈ నెల 31న రీ రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్’లను కలిపి ఒక సినిమాగా తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘మాస్ జాతర’ను ఒక రోజు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం. మామూలుగా అయితే రీ రిలీజ్‌లకు ఇలాంటి మిడ్ రేంజ్ సినిమాలు దారి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ రాజమౌళి అండ్ కో అందరి మీదా రవితేజ సహా మాస్ జాతర టీంలో అందరికీ గౌరవ భావం ఉంది.
‘బాహుబలి’ అంటే తెలుగు సినిమాకు ఒక ప్రైడ్‌లాగా ఫీలవుతారు అందరూ. పైగా రాజమౌళి స్వయంగా ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టి రెండు భాగాలను కలిపి ఒకటిగా చేసి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఆడియన్స్‌లో కూడా సినిమా పట్ల అమితాసక్తి నెలకొంది. ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఒక రేంజిలో జరుగుతున్నాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని 31వ తేదీని ‘బాహుబలి’కి వదిలేసి తర్వాతి రోజు ‘మాస్ జాతర’ను రిలీజ్ చేయబోతున్నారు.
This post was last modified on October 25, 2025 6:52 pm
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…
లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…