స్టేజ్ మీద ఎప్పుడూ చాలా కూల్‌గా కనిపించే యువ నిర్మాత బన్నీ వాసు.. ఇటీవల ‘మిత్రమండలి’ ప్రి రిలీజ్ ఈవెంట్లో కాస్త నోటికి పని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ గురించి సోషల్ మీడియాలో జరిగిన నెగెటివ్ క్యాంపైన్ గురించి ప్రస్తావిస్తూ.. తనను తొక్కాలని ప్రయత్నించినా అది సాధ్యం కాదని.. ఇలాంటి పనులు తన వెంట్రుకతో సమానమని అన్నాడు బన్నీ వాసు. అంతటితో ఆగకుండా.. బూతు అర్థం వచ్చే ఇంకో మాట కూడా అన్నారు.
తన సినిమాకు వ్యతిరేకంగా జరిగిన ప్రచారం గురించి బన్నీ వాసు హర్టయ్యాడన్నది స్పష్టమైంది కానీ.. మరీ స్టేజ్ మీద అలాంటి భాష వాడాల్సింది కాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంలో అల్లు అరవింద్ నుంచి బన్నీ వాసుకు క్లాస్ పడిందట. ఈ విషయాన్ని వాసునే స్వయంగా వెల్లడించాడు.
అరవింద్ సమర్పణలో రాబోతున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు బన్నీ వాసు అతిథిగా హాజరయ్యాడు. అతను మాట్లాడబోతుండగా.. మరో నిర్మాత ఎస్కేఎన్ ‘వాసు గారు ఇప్పుడొక అగ్రెసివ్ స్పీచ్ ఇస్తారు’ అన్నాడు. ఐతే మైక్ అందుకున్నాక బన్నీ వాసు మాట్లాడుతూ..
‘‘కాంట్రవర్శీలు ఏమీ లేవు. వెరీ కూల్. ఆ కాంట్రవర్శీకి అరవింద్ గారి నుంచి తిన్నన్ని తిట్లు మా నాన్నతో కూడ తినలేదు. ఈ రోజు మాత్రం చాలా జాగ్రత్తగా, ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాను. అందుకే టైట్ షర్ట్ కూడా వేసుకొచ్చాను’’ అన్నాడు. అంతలో అరవింద్ అందుకుని.. ఏదైనా వైరల్ కంటెంట్ ఇవ్వు అన్నారు. తర్వాత బన్నీ వాసు అందుకుని.. ‘‘వైరల్ కంటెంట్ ఇవ్వమంటారు. మళ్లీ ఆయనే వైర్ పట్టుకుని కొడతారు’’ అనడంతో ఆడిటోరియంలో నవ్వులు విరిసాయి. ఇంకో నాలుగైదు నెలలు వైరల్ కంటెంట్ ఏమీ ఇవ్వనని వాసు స్పష్టం చేశాడు.
This post was last modified on October 25, 2025 3:08 pm
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇవాళ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక…
తెలంగాణలో మరో కుంభకోణం జరుగుతోందని బీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. దీని…
జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేయడం కలకలం…
సినీ పరిశ్రమను దశాబ్దాల నుంచి పీడిస్తున్న అతి పెద్ద సమస్య.. పైరసీ. గతంలో వీడియో క్యాసెట్లు, సీడీల రూపంలో ఉండే పైరసీ..…
తాను మరో పాదయాత్ర చేయబోతున్నానని ఏపీ మాజీ సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ పరస్పరం బాక్సాఫీస్ వద్ద తలపడిన సందర్భాలు బోలెడున్నాయి కానీ ఒకే బ్యాక్…