‘బాహుబలి’తో తిరుగులేని ఇమేజ్ సంపాదించి ప్రభాస్ కథానాయకుడు.. ‘తానాజీ’తో 2020లో ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్ అందించిన ఓం రౌత్ దర్శకుడు.. అగ్ర నిర్మాణ సంస్థల భాగస్వామ్యం.. రూ.500 కోట్ల బడ్జెట్.. రామాయణం నేపథ్యంలో కథ.. ఈ వార్తలన్నీ చూసి ‘ఆదిపురుష్’ మీద భారీ అంచనాలే పెట్టుకున్నారు అభిమానులు. ప్రభాస్ కెరీర్లో ఇది మరో ‘బాహుబలి’ అవుతుందని భావించారు. కానీ తర్వాత ‘ఆదిపురుష్’ గురించి వచ్చిన అప్ డేట్, ఈ మధ్య వస్తున్న వార్తలు మాత్రం సినిమాపై అంచనాల్ని తగ్గించేస్తున్నాయి. ప్రభాస్ అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి. సినిమాలో కథానాయిక, విలన్ పాత్రల విషయంలో ప్రేక్షకుల అంచనాలు, ఆశలు వేరుగా ఉన్నాయి. ప్రభాస్‌కు దీటైన వాళ్లే ఆ పాత్రలు చేస్తారని ఆశించారు.
కానీ రావణుడిని పోలిన విలన్ పాత్రకు సైఫ్ అలీ ఖాన్‌ను ఎంచుకోవడంతోనే ఆసక్తి సన్నగిల్లింది. ప్రభాస్ ముందు విలన్‌గా అతను నిలవలేడన్న అభిప్రాయం కలిగింది. సైఫ్ మంచి నటుడే అయినప్పటికీ.. అతణ్ని సెకండ్ గ్రేడ్ హీరోగానే చూస్తారు జనాలు. స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో ప్రభాస్ ముందు అతను తేలిపోతాడనే అభిప్రాయముంది. ముఖ్యంగా రావణుడి పాత్రలో ఉండాల్సిన గాంభీర్యం, క్రూరత్వం అతను చూపించలేడనే అంటున్నారు చాలామంది. ఈ సెలక్షనే నిరాశ కలిగించేదంటే.. ఇప్పుడు సీత, లక్ష్మణుడి పాత్రలకు తాజాగా వినిపిస్తున్న పేర్లు ఇంకా నిరాశను పెంచుతున్నాయి.
ఏ కియారా అద్వానీ లాంటి వాళ్లనో ఎంచుకుంటారనుకుంటే.. కృతి సనన్ పేరు తెరపైకి వచ్చిందిప్పుడు. ఆమె సీతగా కానీ, ప్రభాస్‌కు జోడీగా కానీ ఏమాత్రం బాగుండదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అలాగే లక్ష్మణుడి పాత్రకు పెద్ద పేరు లేని సన్నీ సింగ్ ఎంపికయ్యాడన్న వార్తా నిరాశే కలిగిస్తోంది. ఓవైపు ప్రభాస్ ఉండగా.. ఇంకోవైపు వీళ్లందరినీ పెడితే మిస్ మ్యాచ్ అవుతుందని.. సినిమాకు ‘భారీతనం’ చేకూరడం కష్టమని.. కాస్టింగ్ విషయంలో చేస్తున్న ఈ పొరబాట్లు సినిమాపై హైప్‌ను తగ్గించేస్తాయని అభిమానులు భయపడుతున్నారు. మరి రూ.500 కోట్ల బడ్జెట్ పెడుతున్న నిర్మాతలు కాస్టింగ్ విషయంలో ఎందుకు భారీగా ఆలోచించట్లేదన్నది ప్రశ్న.
This post was last modified on November 30, 2020 6:55 am
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…