Movie News

బాలీవుడ్ షాక్… ఇక సౌత్ మీదే ఆశలు

తల్లి శ్రీదేవి ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ ఏడేళ్ల కిందట ‘దఢక్’ సినిమాతో కథానాయికగా అరంగేట్రం చేసింది జాన్వి కపూర్. తొలి సినిమా ఆమెకు మంచి విజయాన్నే అందించింది. కానీ తర్వాత బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తున్నా.. ఆమె కోరుకున్న విజయం దక్కట్లేదు. నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా రిలీజైన ‘గుంజన్ సక్సేనా’ మంచి ఫలితాన్ని అందుకున్నా.. థియేటర్లలో రిలీజైన మరే చిత్రం జాన్వికి సక్సెస్ అందించలేదు.

గత ఏడాది ‘ఉలజ్’తో పెద్ద డిజాస్టర్‌ను ఖాతాలో వేసుకున్న జాన్వికి.. ఈ ఏడాది ఇంకా పెద్ద షాక్‌లు తగిలాయి. కేవలం రెండు నెలల వ్యవధిలో జాన్వి సినిమాలు మూడు రిలీజయ్యాయి. అవే.. పరమ్ సుందరి, సన్నీ సంస్కారి కి తుల్సీ కుమారి, హోం బౌండ్. వీటిలో తొలి రెండు చిత్రాలకు ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ వచ్చాయి కానీ.. అవి బాక్సాఫీస్ దగ్గర నిలబడలేక ఫెయిల్యూర్లుగా నిలిచాయి. హోం బౌండ్‌కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి కానీ.. అది కమర్షియల్‌గా మినిమం ఇంపాక్ట్ చూపించలేకపోయింది.

రెండు నెలల్లో మూడు ఫ్లాపులు ఎదురవడంతో జాన్వికి బాలీవుడ్లో దిక్కు తోచని విధంగా ఉంది. దీంతో కొత్తగా హిందీలో జాన్వి ఏ సినిమా ఒప్పుకోవట్లేదట. ఈ సమయంలో తన ఆశలు, ఫోకస్ మొత్తం సౌత్ మూవీస్ మీదే ఉంది. గత ఏడాది ‘దేవర’తో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వి. ఇప్పుడు రామ్ చరణ్ సరసన ‘పెద్ది’లో నటిస్తోందామె. ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి.

మరోవైపు అల్లు అర్జున్ సరసన అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలోనూ జాన్వి ఓ కథానాయికగా నటిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో దీపికా పదుకొనే మెయిన్ లీడ్ అన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఎన్టీఆర్‌తో దేవర-2 కూడా చేయాల్సి ఉంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజయ్యే ఈ చిత్రాలతో తన రాత మాారుతుందని జాన్వి ఆశిస్తోంది. పెద్ది వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ కానుండగా.. మిగతా రెండు చిత్రాలు 2027లో రిలీజయ్యే ఛాన్సుంది.

This post was last modified on October 23, 2025 4:01 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అర్ధరాత్రి షోలతో వరప్రసాద్ గారి వీరంగం

మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్…

28 minutes ago

బన్నీతో లోకీ – అడవిలో అరాచకం ?

గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…

2 hours ago

షాకింగ్… బాహుబలి 2ని దాటేసిన దురంధర్

చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…

2 hours ago

అన్నగారు తప్పుకోవడమే మంచిదయ్యింది

తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…

3 hours ago

భర్త కోసం చైన్ స్నాచర్ గా మారిన భార్య!

తన ప్రియురాలి కోసం చైన్ స్నాచింగ్స్ దొంగగా మారిన ఒక ప్రియుడు... బైకుల మీద స్పీడుగా వెళుతూ మహిళల మెడల…

5 hours ago

థియేటర్లు సరిపోవట్లేదు మహాప్రభో !

సంక్రాంతి పండక్కు తెలుగు రాష్ట్రాల థియేటర్లకు ఊహించిన సమస్యే తలెత్తింది. షోలు చాలక ప్రేక్షకుల డిమాండ్ అధికం కాగా దానికి…

5 hours ago