Movie News

కిరణ్ నమ్మకం నిజమయ్యిందా

దీపావళి సినిమాల్లో ప్రమోషన్స్ పరంగా కొంచెం కాంట్రావర్సీ పరంగా ముందున్నది కె ర్యాంపే. అయితే టీమ్ మాత్రం ఎక్కడ నమ్మకం తగ్గకుండా ఒకే కాన్ఫిడెన్స్ ని ప్రదర్శిస్తూ వచ్చింది. ఇవాళ ఓపెనింగ్స్ చూస్తే మరీ క, ఎస్ఆర్ కల్యాణమండపం రేంజ్ లో కాదు కానీ ఇంత కాంపిటీషన్ లోనూ మంచి నెంబర్ అనిపించే వసూళ్లే తెచ్చేలా ఉంది. ఉదయం నెమ్మదిగా ఓపెన్ అయినా క్రమంగా పుంజుకున్న వైనం స్పష్టం. ముఖ్యంగా కంటెంట్ లో మాస్ అప్పీల్ జనాన్ని రప్పిస్తోంది. తెలుసు కదా ఓవర్ సాఫ్ట్ కావడం, మిత్ర మండలి రిజల్ట్ ముందే తెలిసిపోవడం లాంటి అంశాలు కె ర్యాంప్ కు కలిసి వస్తున్నాయి.

డ్యూడ్ ఒక్కటే బెటర్ గా నిలుస్తున్న వాస్తవాన్ని కాదనలేం. ఆడియన్స్ ఓటు మొదటగా దానికే పడుతోంది. కె ర్యాంప్ కు యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు కానీ నిరాశపరచలేదనే పబ్లిక్ టాక్ క్రమంగా పుంజుకుంటే కనక వీకెండ్ తో పాటు సోమా మంగళవారాలు దాని అడ్వాంటేజ్ ని తీసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడున్న ట్రెండ్ స్టడీగా ఉండాలి. బుక్ మై షోలో కె ర్యాంప్ ఇప్పటికీ మూడో స్థానంలో ఉండగా నేరుగా టికెట్ల అమ్మకాలు జరిగే కౌంటర్ సేల్స్ బాగున్నాయని ట్రేడ్ రిపోర్ట్. బిసి సెంటర్స్ లో ఇవే కీలకం కాబట్టి బయ్యర్ల నుంచి సరైన అంకెలు వస్తే తప్ప నిజమెంత ఉందో క్లారిటీ రాదు.

ఒక్కటి మాత్రం నిజం. కె ర్యాంప్ కిరణ్ అబ్బవరం గత చిత్రం దిల్ రుబా అంత దారుణంగా లేకపోవడం పెద్ద ఊరట. కొన్ని హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ టైంపాస్ కి ఓకే అనేలా జనాలు సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఆ మేరకు కొంచెం పాజిటివ్  కనిపిస్తోంది. దీన్ని నిలబెట్టుకునే బాధ్యత కిరణ్ మీద ఉంది. స్క్రీన్ కౌంట్, షోలు ప్రస్తుతానికి తక్కువగా ఉన్నా వాటిని పెంచబోతున్నామని నిర్మాత రాజేష్ దండా ఇవాళ ప్రకటించారు. సో ఫైనల్ రేంజ్ ఏంటనేది తేలడానికి ఇంకో అయిదారు రోజులు ఆగాలి. రేపు ఆదివారం కాబట్టి ఢోకా ఉండకపోవచ్చు కానీ మండే నిలబడితే హోల్డ్ అయినట్టే.

This post was last modified on October 18, 2025 10:13 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

లైలా గాయానికి ఫంకీ మందు పని చేస్తుందా

విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…

2 hours ago

ఒకవేళ కవిత సీఎం అయితే?

#AskKavitha- హ్యాష్ ట్యాగ్‌తో నెటిజ‌న్ల నుంచి అభిప్రాయాలు సేక‌రించిన తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత‌.. ఇదే స‌మ‌యంలో ప‌లువురు నెటిజ‌న్లు…

2 hours ago

సూపర్ న్యూస్… సుబ్బులక్ష్మిగా సాయిపల్లవి ?

భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసుల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్థానం ఎవరూ భర్తీ చేయనిది, అందుకోలేనిది. దక్షిణాదిలోనే కాదు…

3 hours ago

పదిరోజుల్లోనే మాట నిలబెట్టుకున్న పవన్

మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…

5 hours ago

మంచు మనోజ్ సినిమాకు మల్టీస్టారర్ హంగులు ?

నటుడిగా చాలా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాల్లో విలన్ గా నటించి కంబ్యాక్ అయ్యాడు.…

5 hours ago

తెలుగు ఐపీఎస్ సూసైడ్ ఎఫెక్ట్.. డీజీపీపై బదిలీ వేటు!

హర్యానాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…

6 hours ago