ఈ మధ్య కొత్త రిలీజులకు ముందు తరచుగా వినిపిస్తున్న మాట సింపతీ కార్డు. ఏదో ఒక రకంగా చేష్టల ద్వారానో లేదా మాటల ద్వారానో సానుభూతి వచ్చేలా చేసుకుని ఓపెనింగ్స్ తెచ్చుకోవడమనేది కొందరు హీరోలు దర్శకులు ఫాలో అవుతున్నదే. అయితే దీని వల్ల పెద్దగా ఫలితం ఉండటం లేదనేది ఓపెన్ సీక్రెట్. అయినా సరే కొందరు ఈ ధోరణి విడిచిపెట్టడం లేదు. తాజాగా కె ర్యాంప్ ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ ఆ మధ్య తాను తొడ కొట్టానని, మరికొందరు ఏడిపించడం ద్వారా, కన్నీళ్లు కురిపించడం ద్వారా అటెన్షన్ తెచ్చుకునే ప్రయత్నం చేశారని, కానీ అవేవి పని చేయవని కుండ బద్దలు కొట్టారు.
తన సినిమా అయినా వేరొకరిది అయినా కంటెంట్ బాగుంటే ప్రేక్షకుల ఖచ్చితంగా చూస్తారు తప్ప ఎవరు ఎలాంటి మాటలు చెప్పినా పనవ్వదని తేల్చేశారు. పోటీలో ఉన్న మిత్ర మండలి, తెలుసు కదా, డ్యూడ్ లకు శుభాకాంక్షలు చెప్పారు. అయితే రాజేష్ దండా ఎవరిని ఉద్దేశించారనేది పేరు చెప్పకపోయినా ఇటీవలే ట్రోలింగ్, యూట్యూబ్ నెగటివ్ కామెంట్స్ మీద విరుచుకుపడిన ఓ నిర్మాతని ఉద్దేశించి ఏమోనని నెటిజెన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఉద్దేశం ఏదైనా అన్ని సినిమాలు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుందనే సూత్రాన్ని మరోసారి మేకర్స్ గుర్తు చేసుకోవడం అవసరమే.
కె ర్యాంప్ మీద రాజేష్ దండా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కిరణ్ అబ్బవరం కూడా చాలా నమ్మకంగా కనిపిస్తున్నాడు. రిస్క్ లేకుండా అందరికంటే చివర్లో శనివారం రిలీజ్ పెట్టుకున్న కె ర్యాంప్ మొదటిషో పడేలోపు మిగిలిన మూడు సినిమాల బాక్సాఫీస్ రిజల్ట్ వచ్చేస్తుంది. వాటిలో ఏది బాగున్నా ఏది బాగోకపోయినా వాటి వల్ల వచ్చే ప్రయోజనాలు, ప్రమోషన్ల పరంగా చేసుకోవాల్సిన కె ర్యాంప్ ప్లానింగ్ కి ఉపయోగపడుతుంది. ఈ ఏడాది దిల్ రుబా రూపంలో డిజాస్టర్ చవి చూసిన కిరణ్ అబ్బవరం ఇప్పుడీ కె ర్యాంప్ తో కంబ్యాక్ అవుతానని ధీమాగా ఉన్నాడు. చూడాలి మరి రేసులో ఏ స్థానంలో ఉంటాడో, ఎలా నెగ్గబోతున్నాడో.
This post was last modified on October 16, 2025 10:41 pm
విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…
#AskKavitha- హ్యాష్ ట్యాగ్తో నెటిజన్ల నుంచి అభిప్రాయాలు సేకరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. ఇదే సమయంలో పలువురు నెటిజన్లు…
భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసుల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్థానం ఎవరూ భర్తీ చేయనిది, అందుకోలేనిది. దక్షిణాదిలోనే కాదు…
మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…
నటుడిగా చాలా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాల్లో విలన్ గా నటించి కంబ్యాక్ అయ్యాడు.…
హర్యానాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…