గత కొన్నేళ్లుగా తమిళ సినిమాల డబ్బింగ్ టైటిల్స్ యధాతధంగా ఒరిజినల్స్ వే పెట్టడం పరిపాటిగా మారిపోయింది. సూపర్ స్టార్ రజనీకాంత్ వెట్టయన్ అయినా, విజయ్ ఆంటోనీ మార్గన్ అయినా అందరిదీ ఇదే వరస. ప్యాన్ ఇండియా పేరు చెప్పి మనోళ్లకు అర్థం కాదని తెలిసినా సరే అలాగే పెడుతున్న దాఖలాలు బోలెడున్నాయి. తంగలాన్, వలిమై, తలైవి, అమరన్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత వస్తుంది. సూర్య రాబోయే మూవీ కరుప్పు ఇదే దారి పట్టింది. బాషా ప్రేమికులు ఎంత నెత్తి నోరు బాదుకున్నా ఈ పరిస్థితిలో మార్పులు తెచ్చేందుకు అనువాద హక్కుల నిర్మాతలు పూనుకోకపోవడం ట్రాజెడీ.
దర్శకుడు వెట్రిమారన్ తీసిన అరసన్ కి తెలుగులో సామ్రాజ్యం టైటిల్ ఫిక్స్ చేశారు. ఇది ఒకప్పుడు అంటే 1992లో మమ్ముట్టి సూపర్ హిట్ డబ్బింగ్ మూవీ పేరు. విజయ్ దేవరకొండ కింగ్డమ్ కు హిందీలో ఇదే పెట్టారు కానీ పెద్దగా పనవ్వలేదు. శింబు హీరోగా రూపొందుతున్న సామ్రాజ్యంకు అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నాడు. అంచనాల పరంగా ఆల్రెడీ తమిళనాట దీనికి పీక్స్ లో క్రేజ్ ఉంది. విడుదల పార్ట్ 1, విడుదల పార్ట్ 2 అయ్యాక వెట్రిమారన్ చేస్తున్న మూవీ ఇదే. సూర్యతో ప్లాన్ చేసుకున్న వడివాసల్ ఆగిపోవడంతో దాని స్థానంలో వేరే కథతో సామ్రాజ్యం తీస్తున్నారు.
ఇప్పుడీ ధోరణి అందరూ ఫాలో కావడం అవసరం. తెలుగు అంటే అందరికీ మరీ చులకన అవుతోంది. వాళ్ళ పేర్లు మనం అలాగే పెట్టుకోవాలి కానీ తెలుగు సినిమాలు తమిళంలో డబ్బింగ్ చేసినప్పుడు మాత్రం మార్చుకోక తప్పని పరిస్థితి. వచ్చే ఏడాది రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్న సామ్రాజ్యం టీజర్ ని జూనియర్ ఎన్టీఆర్ లాంచ్ చేయబోతున్నాడు. తనకు చాలా ఇష్టమైన దర్శకుడు వెట్రిమారనని, ఒకసారి పని చేయాలని ఉందని గతంలో తారక్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడా అభిమానంతో పాటు శింబు ఫ్రెండ్ షిప్ టీజర్ లాంచ్ కి సరేననేలా చేసింది. వడ చెన్నై తరహా బ్యాక్ డ్రాప్ సామాజ్యంలో ఉంటుందని టాక్.
This post was last modified on October 16, 2025 1:08 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…