బిగ్‍బాస్ నాలుగవ సీజన్‍ని అభిజీత్ గెలిచేస్తాడనే సంకేతాలు బలంగా అందుతూ వుంటే… మొదట్నుంచీ టాస్కులు చేయకుండా తన ఇష్టానుసారం వ్యవహరిస్తోన్న అభిజీత్ అదే ఆటిట్యూడ్ కొనసాగించకుండా బిగ్‍బాస్ యాజమాన్యం కొరడా ఝులిపించింది. హోస్ట్ నాగార్జున ఒక రేంజ్‍లో అభిజీత్‍ని రోస్ట్ చేసి పారేయగా అతను బెంబేలెత్తిపోయి మోకాళ్ల మీద పడి మరీ నాగార్జునకు, బిగ్‍బాస్‍కు సారీ చెప్పాడు.
మోనల్ టాపిక్‍లో వివిధ షేడ్స్ చూపించే అభిజీత్‍కి తన వీడియోలు తనకే చూపించి మరీ హౌస్ అందరి ముందు ఎక్స్పోజ్ చేసేసారు. ఇంతకుముందే అభిజీత్‍ని వరస్ట్ పర్‍ఫార్మర్‍గా స్వయంగా బిగ్‍బాస్ ప్రకటించాడు. ఇక అతడి అడుగులకి మడుగులు ఒత్తుతూ అతని ఆజ్ఞానుసారం గేమ్ ఆడుతోన్న దేత్తడి హారికకు కూడా అక్షింతలు బాగానే పడ్డాయి. ఎక్కడికక్కడ అభిజీత్‍కి ఏది చేస్తే నచ్చుతుందో అదే చేస్తూ వస్తోన్న హారికకు పలు వీడియోలు చూపించి మరీ కన్ఫెషన్ రూమ్‍లో ఒక ఆట ఆడుకున్నారు.
దాంతో ఆమె అభిజీత్ పక్కన కూర్చోవడానికి భయపడిపోయింది. ఇదిలావుంటే అభిజీత్‍ని టార్గెట్ చేస్తున్నారంటూ అతని ఫాలోవర్స్ ట్రెండ్ మొదలు పెట్టారు. మరో మూడు వారాలే వున్న దశలో ఈ ఎపిసోడ్ ఇక మిగతా సీజన్‍ను ఎలా ప్రభావితం చేస్తుంది, ఇక్కడ్నుంచి అభిజీత్, హారిక గేమ్ ఎలా వుంటుందనేది ఆసక్తికరం.
This post was last modified on November 29, 2020 1:28 am
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…