బిగ్‍బాస్ సీజన్ 3 విజేత అవుతుందని భావించిన శ్రీముఖి స్వయంకృతం వల్ల ట్రోఫీ చేజార్చుకుంది. అసలు ఎక్కువ మందికి తెలియనే తెలియని రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ అవడానికి శ్రీముఖి పరోక్షంగా దోహదపడింది. బిగ్‍బాస్ తర్వాత ఆమె కెరియర్ ఏమంత గొప్పగా సాగడం లేదు. ఈ నేపథ్యంలో ఆమె హోస్ట్గా ‘బొమ్మ అదిరింది’ అనే షో మొదలయింది. సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసే షోలు ఇప్పటికే చాలా పాపులర్ అయ్యాయి.
మంచు లక్ష్మి మొదలు పెట్టిన అలాంటి షో తర్వాత రానా దగ్గుబాటి రేంజ్‍కి వెళ్లింది. ఇప్పుడు ఏకంగా సమంత లాంటి సూపర్‍స్టార్‍ని దింపి ఆహా కోసం సామ్ జామ్ చేస్తున్నారు. ఎలాంటి కొత్తదనం లేని ఈ షోలు క్లిక్ అవ్వాలంటే సమంత స్థాయి పాపులారిటీ కంపల్సరీ అని ఆహా వాళ్లు గుర్తించారు. అయితే అది గుర్తించని శ్రీముఖి ‘బొమ్మ అదిరింది’ అని పేరు పెట్టుకుంది కానీ ఆ షో మాత్రం అదరలేదు. 3.5 రేటింగులతో ఆ షో డొల్లతనం బయట పడిపోయింది.
ఇదిలా వుంటే సినిమా అవకాశాలను తోసిపుచ్చి వెబ్ సిరీస్‍లు చేయడం మీద శ్రీముఖి ఆసక్తి చూపిస్తోందట. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఘనంగా వున్నా కానీ ఆ ఆడియన్స్ని తన షోలు చూసే విధంగా శ్రీముఖి ఆకర్షించలేకపోతోంది. ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాల్సిన టైమ్ వచ్చేసినట్టుంది శ్రీముఖీ.
This post was last modified on November 29, 2020 1:24 am
తండేల్ ప్రమోషన్లలో భాగంగా అల్లు అరవింద్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మగధీర తన మేనల్లుడు రామ్ చరణ్ కు ఎలాగైనా…
అమెరికా ప్రభుత్వం అక్రమంగా ఉన్న 104 మంది భారతీయులను దేశం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పంజాబ్లోని అమృత్సర్కు ప్రత్యేక…
ఆస్ట్రేలియా జట్టు ఈసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో స్ట్రాంగ్ టీమ్ గా రాబోతోంది అనుకుంటున్న టైమ్ లో ఊహించని పరిణామాలు…
ఏప్రిల్ 10 ది రాజా సాబ్ రావడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే అయినా టీమ్ ఇప్పటిదాకా ఆ విషయాన్ని…
ఇరవై రెండు సంవత్సరాల క్రితం రిలీజైన జానీ ఇప్పటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక కల్ట్ లా ఫీలవుతారేమో కానీ…
ఆరాధన సినిమాలో పులిరాజు పాత్ర పోషించిన చిరంజీవి ఎక్స్ ప్రెషన్ ని తన ఆఫీస్ లో ఫోటో ఫ్రేమ్ గా…