Movie News

రానాకు గత ఏడాది అసలేమైంది?

దగ్గుబాటి రానా అనారోగ్యం గురించి గత ఏడాది ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. అతడి కిడ్నీలు పాడయ్యాయని, ప్రాణాపాయం ఎదుర్కొంటున్నాడని.. ఇలా రకరకాల వార్తలొచ్చాయి. అప్పట్లో రానా ఒక్కసారిగా బక్క చిక్కి కనిపించడం కూడా అందరిలో ఆందోళన రేకెత్తించింది. ఐతే తర్వాత అతను కోలుకుని మామూలు మనిషి అయ్యాడు. ఐతే తాజాగా సమంత నిర్వహించే టాక్ షోలో రానా దీని గురించి ప్రస్తావించాడు.

తన ఆరోగ్యం గురించి సంచలన విషయాలు వెల్లడించాడు. దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవలే వైరల్ అయింది. సంబంధిత ఎపిసోడ్ ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. అందులో తన అనారోగ్యంపై రానా మరింత వివరంగా మాట్లాడాడు. గత ఏడాది అసలేం జరిగిందో వివరించాడు. ఆ విషయాలు అతడి మాటల్లోనే..

‘‘అరణ్య సినిమా షూటింగ్‌కు కొన్ని రోజుల ముందు కళ్లకు లేజర్ సర్జరీ చేయించుకోవాలనుకున్నా. అందుకోసం చిన్నప్పట్నుంచి తెలిసిన వైద్యుణ్ని కలిశాను. ఆయన బీపీ టెస్ట్ చేసి.. ‘నీ ఆరోగ్యం బాగానే ఉందా? నడుస్తున్నప్పుడు తల తిరుగుతున్నట్లు ఏమైనా అనిపిస్తోందా?’ అని అడిగారు. అలా ఏం లేదు, బాగానే ఉన్నా అని చెప్పా. ఐతే బీపీ ప్రాబ్లెంగా ఉందని, సర్జరీ ఒక రోజు తర్వాత చేద్దామన్నారు. మధ్యలో వేరే డాక్టర్‌ను కలవమన్నారు. ఆ వైద్యుడి దగ్గరికెళ్తే మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అనేక టెస్టులు చేశారు. తర్వాత ఆ ఆసుపత్రి హెడ్ వచ్చి నా ఆరోగ్య సమస్య తీవ్రత చెప్పారు. వెంటనే నాన్నను తీసుకుని యుఎస్‌కు వెళ్లిపోయాను. అక్కడ మూడు రోజల పాటు వైద్యులు అనేక పరీక్షలు చేశారు. చిన్నప్పట్నుంచి నాకు బీపీ ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తాయని.. కిడ్నీలు పాడయ్యాయని.. వెంటనే చికిత్స తీసుకోకుంటే ప్రమాదమని చెప్పారు. తనకున్న ఆరోగ్య సమస్య వల్ల ఆరు నెలల నుంచి ఏడాదిలోపు గుండెపోటు రావచ్చని.. మెదడులో నరాలు చిట్లి పోవడానికి 70 శాతం, చనిపోవడానికి 30 శాతం ఆస్కారం ఉందని చెప్పారు. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలని.. మాంసాహారం, ఉప్పు తినొద్దని సూచించారు. వాళ్ల సూచనలు పాటించి, చికిత్స తీసుకుని ఆరోగ్యంగా స్వదేశానికి తిరిగొచ్చాను’’ అని రానా గుర్తు చేసుకున్నాడు.

This post was last modified on November 28, 2020 5:08 pm

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

10 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

10 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

10 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

10 hours ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

13 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

14 hours ago