పేద వాడైన హీరో ధనవంతుడిలా కలరింగ్ ఇస్తూ హీరోయిన్ ఫ్యామిలీలోకి ఎంట్రీ ఇవ్వడం.. అక్కడ మామను ఒక ఆట ఆడుకోవడం.. తన అసలు రూపం బయటపడినపుడు తన లాగే ఇంకొకడున్నానడి.. తాము కవలలమని కవర్ చేయడం.. ఈ దాగుడు మూతల మధ్య కథ కామెడీగా సాగిపోవడం.. ఈ నేపథ్యంలో తెలుగులో ఎన్ని సినిమాలు వచ్చాయో లెక్కలేదు. ఈ కన్ఫ్యూజింగ్ కామెడీ ఒక దశ దాటాక మన జనాలకు మొహం మొత్తేసింది. ఆ టైపు సినిమాలను పక్కన పెట్టేశారు.
ఐతే ఇప్పుడు ఈ ఫార్ములాతో, అనేక తెలుగు సినిమాల్ని తలపించే పాత్రలు, కథతో హిందీలో ఓ సినిమా తెరకెక్కింది. అదే.. కూలీ నంబర్ వన్. 90వ దశకంలో తెలుగులో సూపర్ హిట్టయిన వెంకటేష్ మూవీ ‘కూలీ నంబర్ వన్’ను హిందీలో గోవిందా హీరోగా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ కథను మోడర్నైజ్ చేసి వరుణ్ ధావన్ హీరోగా అదే పేరుతో కొత్త సినిమా తీశాడు అతడి తండ్రి డేవిడ్ ధావన్.
పేరుకు 2020 సినిమానే కానీ.. ఈ సినిమా నడత అంతా పాత స్టయిల్లో ఉంటుందని ‘కూలీ నంబర్ వన్’ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్లో ప్రతి సన్నివేశం కూడా తెలుగు సినిమాలనే తలపిస్తోంది. ఇలాంటి కన్ఫ్యూజింగ్ కామెడీలు మన దగ్గర కోకొల్లలు. ఐతే గోల్ మాల్ సిరీస్ తరహాలో లౌడ్, మాస్ కామెడీతో సినిమాను వినోదాత్మకంగానే నడిపించినట్లున్నాడు డేవిడ్ ధావన్. ట్రైలరంతా విపరీతమైన హడావుడి కనిపించింది.
హీరోకు, హీరోయిన్ తండ్రి పాత్రలో నటించిన పరేష్ రావల్‌కు మధ్య సన్నివేశాలు హైలైట్‌గా కనిపిస్తున్నాయి. జానీ లీవర్ సహా కమెడియన్లు చాలామందినే రంగంలోకి దించారు. హీరోయిన్ సారా అలీ ఖాన్ కెరీర్లో ఇంతకుముందెన్నడూ లేనంత హాట్ హాట్‌గా కనిపిస్తోంది. క్లీవేజ్ షోలు, లిప్ లాక్‌లకు లోటే లేనట్లుంది. మామూలుగా అయితే ఈ ఏడాది వేసవిలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాల్సింది. కరోనా వల్ల వాయిదా పడ్డ ఈ చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్‌కు ఇచ్చేశారు. క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న ఈ చిత్రం విడుదల కానుంది.
This post was last modified on November 28, 2020 4:47 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…