Movie News

కొత్తవి వ‌ద్దు.. పాత‌వే ముద్దు

గ‌త నెల ఆరంభంలో లిటిల్ హార్ట్స్‌తో మొద‌లుపెట్టి.. టాలీవుడ్ బాక్సాఫీస్‌లో డ్రీమ్ ర‌న్ కొన‌సాగుతోంది. ఆ సినిమా కొన్ని వారాల పాటు మంచి వ‌సూళ్లు సాధించింది. త‌ర్వాతి వారం వ‌చ్చిన మిరాయ్ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. కిష్కింధ‌పురి సైతం బాగా ఆడింది. ఇక నెల చివ‌ర్లో వ‌చ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చిత్రం ఓజీ బంప‌ర్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది.

ఇక ద‌స‌రా వీకెండ్లో విడుద‌లైన క‌న్న‌డ అనువాదం కాంతార‌: చాప్ట‌ర్-1 తొలి వారాంతంలో భారీ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇక కొత్త వారంలో కొత్త సినిమాల జోరేమైనా ఉంటుందేమో అనుకుంటే.. అలాంటిదేమీ జ‌ర‌గ‌లేదు. ఈ వారం విడుద‌లైన‌వ‌న్నీ చిన్న చిత్రాలే. అవేవీ ప్ర‌భావం చూపే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. శ‌శివ‌ద‌నే, అరి, కానిస్టేబుల్ సినిమాలు త‌క్కువ థియేట‌ర్ల‌లో పెద్దగా అంచ‌నాలు లేకుండా విడుద‌ల‌య్యాయి. వీటిలో ఏ సినిమాకూ పాజిటివ్ టాక్ రాలేదు.

టాక్ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. వీటి ప‌ట్ల ప్రేక్ష‌కుల్లో పెద్ద‌గా ఆస‌క్తి క‌నిపించ‌లేదు. థియేట‌ర్లు ఖాళీగా క‌నిపించాయి. చాలా చోట్ల జ‌నాలు లేక షోలు క్యాన్సిల్ చేయాల్సిన ప‌రిస్థితి. అదే స‌మ‌యంలో ముందు వారాల్లో విడుద‌లైన సినిమాల ప‌ట్ల ప్రేక్ష‌కులు బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. శుక్ర‌వారం కాంతార ప్రీక్వెల్‌కు హైద‌రాబాద్ స‌హా తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో మ‌ల్టీప్లెక్సుల్లో కొన్ని షోల‌కు హౌప్ ఫుల్స్ ప‌డ్డాయి. చాలా షోలకు మంచి ఆక్యుపెన్సీలు క‌నిపించాయి.

సింగిల్ స్క్రీన్ల‌లో కూడా ఆక్యుపెన్సీలు ప‌ర్వాలేదు.
దీపావ‌ళి సినిమాలు వ‌చ్చే వ‌ర‌కు కాంతార‌కు ఢోకా లేన‌ట్లే కనిపిస్తోంది. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా ఓజీ బాక్సాఫీస్‌లో రెండో స్థానంలో కొన‌సాగుతోంది. ఆ సినిమాకు వ‌సూళ్లు ఓ మోస్త‌రుగా ఉన్నాయి. తొలి వీకెండ్ త‌ర్వాత ప‌వ‌న్ సినిమా డౌన్ అయ‌నప్ప‌టికీ.. వీకెండ్ వ‌చ్చే స‌మ‌యానికి రేట్లు త‌గ్గించ‌డం క‌లిసొచ్చింది. కాంతార నుంచి పోటీని త‌ట్టుకుని ఆ సినిమా బాగానే నిల‌బ‌డుతోంది. శ‌ని, ఆదివారాల్లో కాంతార‌, ఓజీల‌కు మ‌రింత మెరుగైన వ‌సూళ్లు ఉంటాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.

This post was last modified on October 11, 2025 9:52 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

నందమూరి ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం

‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…

1 minute ago

అమెరికా కొంటే తప్పులేదు.. భారత్ కొంటే తప్పా?

ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…

9 minutes ago

ఇండిగో దెబ్బకు డీజీసీఏ యూ టర్న్!

ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులు గందరగోళంగా మారడంతో కేంద్రం దిగివచ్చింది. ప్రయాణికుల కష్టాలు చూడలేకనో, లేక ఇండిగో లాబీయింగ్‌కు…

19 minutes ago

మా ఆవిణ్ణి గెలిపిస్తే.. ఫ్రీ షేవింగ్‌: ‘పంచాయ‌తీ’ హామీ

ఎన్నిక‌లు ఏవైనా.. ప్ర‌జ‌ల‌కు 'ఫ్రీ బీస్‌' ఉండాల్సిందే. అవి స్థానిక‌మా.. అసెంబ్లీనా, పార్ల‌మెంటా? అనే విష‌యంతో సంబంధం లేకుండా పోయింది.…

23 minutes ago

ఇండిగో ఎఫెక్ట్: టెక్కీల ‘డిజిటల్’ రిసెప్షన్!

కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఒక వింత సంఘటన జరిగింది. రిసెప్షన్ వేదిక రెడీ, బంధువులంతా వచ్చేశారు, విందు భోజనాలు సిద్ధం. కానీ…

1 hour ago

వీసా ఇంటర్వ్యూ.. ఇక నుంచి మరో టెన్షన్

అమెరికా వీసా (H-1B, H-4) కోసం అప్లై చేసేవారికి కొత్త టెన్షన్ మొదలైంది. ఇకపై ఇంటర్వ్యూకి వెళ్లేముందు సర్టిఫికెట్లు సరిచూసుకోవడమే…

1 hour ago