థియేటర్లలో అదిరిపోయే హిట్టందుకున్న ప్రతి సినిమా ఓటిటిలోనూ అదే స్పందన తెచ్చుకుంటుందన్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే థియేటర్, డిజిటల్ ఆడియన్స్ కి మధ్య ఇటీవలి కాలంలో వ్యత్యాసం ఎక్కువైపోతోంది. దానికి ఉదాహరణగా లిటిల్ హార్ట్స్ నిలుస్తోంది. ఇటీవలే ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మీద సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. క్రింజ్ కామెడీ అని, దీనికి ముప్పై కోట్ల వసూళ్లు వచ్చాయాని ఇలా రకరకాల అభిప్రాయాలు దర్శనమిస్తున్నాయి. వ్యూస్ అయితే మిలియన్ల నిమిషాలలో వస్తున్నాయి కానీ రెస్పాన్స్ వెరైటీగా ఉంది.
ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలో జాతిరత్నాలు లాంటి ఎంటర్ టైనర్లకూ ఇది అనుభవమే. అమెజాన్ ప్రైమ్ లో చూసినాళ్ళు అంతగా ఏముందని పెదవి విరిచారు. శ్రీవిష్ణు సింగల్ కూడా ఇదే తరహా రెస్పాన్స్ చవి చూసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే థియేటర్లో వందలాది మధ్య కూర్చుని కామెడీ సినిమా చూస్తున్నప్పుడు కలిగే ఎక్స్ పీరియన్స్ వేరుగా ఉంటుంది. ఉదాహరణకు లిటిల్ హార్ట్స్ లో కాత్యాయని భోంచేసవా అనే పాట బిగ్ స్క్రీన్ మీద డాల్బీ సౌండ్ లో హిలేరియస్ గా పేలింది. అయితే ఇంట్లో స్మార్ట్ టీవీలో చూస్తున్నప్పుడు అందులో సగం ఫీల్ కూడా రాదు.
అంటే జనాల ప్రతిస్పందనలు ఒక్కోసారి పక్కవాళ్ళ మీద ఆధారపడతాయని చెప్పడానికి ఇంత కన్నా ఉదాహరణలు అక్కర్లేదు. అయినా లిటిల్ హార్ట్స్ ని యూత్ లో అత్యధిక శాతం థియేటర్లోనే చూసి ఎంజాయ్ చేసింది. ఫ్యామిలీస్ కూడా బాగానే వెళ్లాయి. అలాని ఇదేమి క్లీన్ అండ్ బెస్ట్ ఎంటర్ టైనర్ కాదు కానీ ఉన్నంతలో ఎలాంటి ఇబ్బంది లేకుండా నవ్వించడంలో సక్సెస్ అయ్యింది. ఒక్కటి మాత్రం నిజం. విజువల్ గ్రాండియర్ అయినా చక్కిలిగింతలు పెట్టే కామెడీ మూవీ అయినా ఆడిటోరియంలో చూస్తే కలిగే అనుభూతిని ఓటిటి, స్మార్ట్ ఫోన్లు, టీవీలు ఇవ్వలేవన్నది మరోసారి ఋజువైపోయిందిగా.
This post was last modified on October 8, 2025 3:35 pm
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…