అక్టోబర్ 31 మాస్ జాతర విడుదల కానుంది. ఇకపై ఎలాంటి వాయిదాలు ఉండవని ఏకంగా వినాయకుడి మీద ఒట్టేసి మరీ ప్రమోషన్లు మొదలుపెట్టారు కాబట్టి ఇంకే అనుమానాలు అక్కర్లేదు. ఆల్రెడీ ఒక గ్రూప్ ఇంటర్వ్యూ రిలీజైపోగా మిగిలినవి ఒక్కొక్కటిగా వదలబోతున్నారు. భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో శ్రీలీల హీరోయిన్ కాగా భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చాడు. ధమాకా మేజిక్ మరోసారి రిపీట్ చేస్తాడనే నమ్మకం అభిమానుల్లో ఉంది. అయితే అసలు విషయం ఇది కాదు. అదే రోజు బాహుబలి ఎపిక్ రీ రిలీజ్ కానుండటం డిస్కషన్ కు దారి తీస్తోంది.
మాములుగా ది బిగినింగ్ లేదా కంక్లూజన్ ఏదో ఒక భాగం మళ్ళీ విడుదల చేస్తుంటే ఇప్పుడీ డిస్కషన్ అక్కర్లేదు. కానీ రెండు పార్ట్స్ కలిపి 3 గంటల 40 నిమిషాల నిడివితో ఒక కొత్త ఎడిషన్ తయారుచేశారు. అంటే సుమారు రెండు గంటల కంటెంట్ ని తీసేసి కొత్త వెర్షన్ రెడీ చేస్తున్నారు. అసలు రిలీజ్ టైంలో థియేటర్ ఎక్స్ పీరియన్స్ చేయనివాళ్ళు ఈసారి ఛాన్స్ మిస్ చేయరు. పైగా రాజమౌళి బృందం చేస్తున్న పబ్లిసిటీ మాములుగా లేదు. ఇప్పటినుంచే హడావిడి మొదలుపెట్టారు. నిర్మాత శోభు యార్లగడ్డ ఆసక్తికరమైన విషయాలు పంచుకుంటున్నారు. రేపో ఎల్లుండో రాజమౌళి దర్శనం కూడా జరగనుంది.
రవితేజ లాంటి స్టార్ హీరో రేంజ్ కి ఆందోళన పడాల్సిన అవసరం లేదు కానీ బాహుబలి హంగామా చూస్తుంటే థియేటర్ల పంపకాలతో పాటు ఓపెనింగ్స్ పరంగానూ ఎఫెక్ట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ దీన్ని ధీటుగా ఎదురుకోవాలంటే మాస్ జాతరకు ఎక్స్ ట్రాడినరి టాక్ రావాలి. విక్రమార్కుడు, కిక్, క్రాక్, ఇడియట్ రేంజ్ లో వస్తే ఏ చింతా లేదు. మాస్ మహారాజ ఈజీగా కాచుకుంటాడు. కానీ కొత్త దర్శకుడు అంత గొప్పగా హ్యాండిల్ చేసి ఉంటాడా అనేదే ఫ్యాన్స్ మనసులో మెదులుతున్న సందేహం. టీమ్ మాత్రం నిశ్చింతగా ఉంది. ఈసారి హిట్టు కొట్టడం ఖాయమనే తరహాలో స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. చూద్దాం.
This post was last modified on October 8, 2025 6:52 am
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…