క్షణం నుంచి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని.. వరుసగా విజయాలతో దూసుకెళ్తున్న నటుడు అడివి శేష్. థ్రిల్లర్ కథలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన శేష్.. తను స్వయంగా కథల తయారీ, మేకింగ్‌లో భాగమై తన చిత్రాలు మంచి క్వాలిటీతో రూపొందడంలో కీలక పాత్ర పోషిస్తుంటాడు. ఐతే శేష్‌తో ఉన్న ఇబ్బంది ఏంటంటే.. రైటింగ్, మేకింగ్ కోసం చాలా టైం తీసుకుంటాడు. దీని వల్ల సినిమాకు సినిమాకు చాలా గ్యాప్ వచ్చేస్తుంటుంది. తన చివరి చిత్రం హిట్-2 ఎప్పుడో 2022లో రిలీజైంది. ఇప్పటిదాకా కొత్త సినిమా రాలేదు.
ఈ ఏడాది వేసవిలోనే వస్తుందనుకున్న డెకాయిట్ మూవీ హీరోయిన్ మార్పు, షూటింగ్ షెడ్యూళ్లు మారడం వల్ల ఆలస్యం అయింది. చివరికి క్రిస్మస్ కానుకగా డిసెంబరు మూడో వారంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు ఆ మధ్య ప్రకటించారు. మొత్తానికి మూడేళ్ల తర్వాత అయినా శేష్ సినిమా రాబోతోందని తన అభిమానులు హ్యాపీగా ఫీలయ్యారు. కానీ తాజా సమాచారం ఏంటంటే.. డెకాయిట్ ఈ ఏడాది విడుదల కాదట. ఇంకొన్ని నెలల తర్వాత కొత్త ఏడాదిలో ఆ చిత్రం విడుదల కానుందట.
డెకాయిట్ షూటింగ్ సందర్భంగా ఈ మధ్య అడివి శేష్ గాయపడ్డాడు. దీంతో కొన్ని వారాల విశ్రాంతి అనివార్యమైంది. ఇక ముందు తీయాల్సినవి కూడా భారీ యాక్షన్ ఘట్టాలే. దీంతో షూటింగ్ మరింత ఆలస్యం కానుంది. డిసెంబరు రిలీజ్ డేట్‌ను అందుకోవడం అసాధ్యమని టీం భావిస్తోంది. త్వరలోనే సినిమా వాయిదా గురించి అధికారిక ప్రకటన చేయబోతున్నారు. డెకాయిట్ ఆలస్యం అయిందంటే.. దాని ఎఫెక్ట్ శేష్ మరో చిత్రం గూఢచారి-2 మీద కూడా పడుతుంది. మేలో రావాల్సిన ఆ సినిమా కూడా ఇంకా వెనక్కి వెళ్లడం ఖాయం.
బహుశా డెకాయిట్ వచ్చే వేసవికి ఫిక్స్ కావచ్చు. ఆ తర్వాత కొన్ని నెలల గ్యాప్‌లో గూఢచారి-2 రావచ్చు. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తున్న డెకాయిట్ మూవీని గూఢచారి, మేజర్ చిత్రాల సినిమాటోగ్రాఫర్ షనీల్ డియో రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు గూఢచారి-2కు కూడా శేష్ రచయితగా పని చేశాడు. గూఢచారి-2 చిత్రానికి విజయ్ కుమార్ సింగినీడి దర్శకుడు. అందులో ఓజీ విలన్ ఇమ్రాన్ హష్మి ప్రతినాయక పాత్ర చేస్తుండడం విశేషం.
This post was last modified on October 7, 2025 10:44 am
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…
తన పాత పాటలు ఏవైనా కొత్త సినిమాల్లో వాడుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. నోటీసులు ఇస్తున్నారు.…
జాతీయ సినీ అవార్డులు ప్రకటించినపుడల్లా.. ఫలానా సినిమాకు అన్యాయం జరిగింది, ఫలానా ఆర్టిస్టుకు అవార్డు ఇవ్వాల్సింది అనే చర్చ జరగడం…