ప్రస్తుతం ఇండియాలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడు తమన్. దక్షిణాదిన నంబర్ వన్ స్థానానికి అతను అనిరుధ్ రవిచందర్‌తో గట్టిగా పోటీ పడుతున్నాడు. అడపాదడపా బాలీవుడ్ సినిమాలకు కూడా సంగీతం అందిస్తూ.. ఉత్తరాదిన కూడా మంచి పేరే సంపాదించాడు. అతడికి దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ నుంచి ప్రశంసలు లభించాలి.
ఐతే ఆ కాంప్లిమెంట్స్ సంగీతం విషయంలో అనుకుంటే పొరపాటే. తమన్ బ్యాటింగ్ నైపుణ్యాలను సచిన్ కొనియాడాడట. ఈ విషయాన్ని తమనే స్వయంగా వెల్లడించాడు. తమన్ తాజాగా అమెరికా పర్యటనకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. తిరుగు ప్రయాణంలో డల్లాస్ నుంచి దుబాయ్‌కి విమానంలో వస్తుండగా.. సచిన్ కలిశాడట. ఆ సందర్భంగా జరిగిన సంభాషణలో సంగీతంతో పాటు క్రికెట్ సంబంధిత విషయాలపై ఇరువురి మధ్య చర్చ జరిగిందట.
తమన్‌కు క్రికెట్ అంటే ప్రాణం అన్న సంగతి తెలిసిందే. మ్యూజిక్ నుంచి కాస్త బ్రేక్ దొరికినపుడల్లా అతను క్రికెట్ ఆడుతుంటాడు, చూస్తుంటాడు. సెలబ్రెటీ క్రికెట్ లీగ్‌లో అతను ప్రతి సీజన్లో పాల్గొంటూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే తన బ్యాటింగ్ వీడియోలను సచిన్‌కు చూపించాడట తమన్. ఈ సందర్భంగా బ్యాటింగ్ చేసేటపుడు తన బ్యాట్ స్పీడు చూసి ఆశ్చర్యపోయాడట సచిన్. నీ బ్యాట్ స్పీడ్ బాగుంది అంటూ ప్రశంసించాడట.
సచిన్ నుంచి ఇలాంటి కాంప్లిమెంట్స్ రావడంతో ఉబ్బితబ్బిబ్బయిన తమన్.. సోషల్ మీడియా పోస్టు ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నాడు. తమన్‌కు సెలబ్రెటీ క్రికెట్ లీగ్‌లో హార్డ్ హిట్టర్‌గా పేరుంది. అతను బ్యాటింగ్‌కు వచ్చాడంటే భారీ షాట్లతో బౌలర్లను బెంబేలెత్తిస్తాడు. చెన్నైలో ఉండి రికార్డింగ్స్ చేసే తమన్.. క్రికెట్ మ్యాచ్‌ల కోసమే హైదరాబాద్ వచ్చి వెళ్తుంటాడు.
This post was last modified on October 6, 2025 4:25 pm
దురంధర్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. మాములుగా మంగళవారం లాంటి వీక్ డేస్…
రాజా సాబ్ నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. దర్శకుడు మారుతీ లిరికల్స్ కు పరిమితం కాకుండా ఏకంగా వీడియో…
చెల్లెలికి బర్త్‌డే విషెస్ చెప్పని అన్న… వినడానికి ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! పాలిటిక్స్‌లో అది ఎవరై ఉంటారు? అని ఎవరైనా…
సినిమాల్లో కంటెంట్ ఎలా ఉందన్న దాని కంటే.. ఆ సినిమా టీంలో ముఖ్యమైన వ్యక్తుల మాటతీరును, నడవడికను బట్టి కూడా సినిమాకు ఓపెనింగ్స్…
తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే.…
అఖండ 2 తాండవంతో గత వారం గడిచిపోయాక ఇప్పుడు మూవ్ లవర్స్ చూపు కొత్త ఫ్రైడే మీదకు వెళ్తోంది. బాలయ్య…