Movie News

నాని ‘ప్యారడైజ్’కు బంపర్ ఎలివేషన్

బాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘కిల్’ మూవీ చూసిన వాళ్లెవ్వరూ అందులో విలన్ పాత్ర చేసిన రాఘవ్ జుయెల్‌ను అంత సులువుగా మరిచిపోలేరు. ట్రైన్స్ మీద పడి ప్రయాణికులపై పాశవిక దాడి చూస్తూ, దోచుకునే దొంగల ముఠా నాయకుడిగా అతడి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒళ్లు గగుర్పొడిచే రీతిలో నటించి గొప్ప పేరే సంపాదించాడు రాఘవ్. ఈ ఒక్క సినిమాతో అతను బాలీవుడ్లో బిజీ అయిపోయాడు. ఇటీవలే ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ సిరీస్‌తో పలకరించిన ఈ యువ నటుడు.. తెలుగులోకి కూడా ఎంట్రీ ఇస్తుండడం విశేషం.

నేచురల్ స్టార్ నాని మూవీ ‘ది ప్యారడైజ్’లో అతను ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఇందులో మోహన్ బాబు మెయిన్ విలన్ కాగా.. రాఘవ్‌ది కూడా నెగెటివ్ రోలే అని తెలుస్తోంది. ‘ప్యారడైజ్’ గురించి ఒక ఇంటర్వ్యూలో అతను ఇచ్చిన ఎలివేషన్ చూసి నాని ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు.

‘ది ప్యారడైజ్’ను అంతర్జాతీయ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసే సినిమాగా రాఘవ్ జుయెల్ అభివర్ణించాడు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలోనే కాక.. అంతర్జాతీయంగా కూడా కొన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఐతే అదేదో మొక్కుబడి వ్యవహారం కాదని.. ఇంటర్నేషనల్‌గా కూడా ఈ సినిమా మంచి ప్రభావం చూపుతుందని రాఘవ్ ధీమా వ్యక్తం చేశాడు.

తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే సినిమా ఇదని.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల విజన్ అద్భుతమని.. ప్రేక్షకులకు అతను థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్నాడని రాఘవ్ తెలిపాడు. ఈ సినిమాలో తన లుక్ షాకింగ్‌గా ఉంటుందని.. దాని కోసం ఎదురు చూడాలని రాఘవ్ అన్నాడు. తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంటున్నానని.. అది కష్టంగా ఉన్నప్పటికీ, సవాలుగా తీసుకుని పని చేస్తున్నానని రాఘవ్ తెలిపాడు. ‘ది ప్యారడైజ్’ వచ్చే ఏడాది మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

This post was last modified on October 6, 2025 12:15 pm

Share

Recent Posts

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

30 minutes ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

8 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

11 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

11 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

11 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

11 hours ago