Movie News

‘కాంతార’ కథ ఎలా పుట్టింది?

గత కొన్నేళ్లలో ఇండియన్ బాక్సాఫీస్‌లో అతి పెద్ద సెన్సేషన్ అంటే.. ‘కాంతార’ అనే చెప్పాలి. ఈ సినిమాకు హీరో కమ్ డైరెక్టర్ అయిన రిషబ్ శెట్టి కన్నడేతర భాషల వాళ్లకు అస్సలు పరిచయం లేదు. సినిమాలో ఇంకెవరూ పేరున్న ఆర్టిస్టులు లేరు. మూడేళ్ల ముందు కన్నడలో ఓ మోస్తరు అంచనాలతో విడుదలైందీ చిత్రం. కానీ అక్కడ బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకోవడం.. రెండు వారాల తర్వాత తెలుగు, హిందీ భాషల్లోనూ అనువాదమై రిలీజ్ కావడం.. రెండు చోట్లా అనూహ్యమైన ఆదరణ సంపాదించుకుని సంచలనం సృష్టించడం.. అన్నీ ఒక కలలా జరిగిపోయాయి.

దెబ్బకు ‘కాంతార: చాప్టర్-1’కు అనూహ్యమైన క్రేజ్ వచ్చింది. తొలి రోజే రూ.89 కోట్ల మేర వసూళ్లు సాధించే స్థాయి హైప్‌తో సినిమా రిలీజైంది. వీకెండ్లో దేశవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబడుతూ సాగుతోందీ చిత్రం. ఫుల్ రన్లో ఈజీగా రూ.500 కోట్ల మార్కును దాటేలా ఉంది ‘కాంతార: చాప్టర్-1’.

ఇంతటి సంచలనం రేపుతున్న కథకు పునాది ఎలా పడింది అన్నది ఆసక్తికరం. ఈ విషయాన్నే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు రిషబ్ శెట్టి. ‘‘20 ఏళ్ల కిందట మా గ్రామంలో జరిగిన ఒక సంఘటన ‘కాంతార’కు పునాది వేసింది. వ్యవసాయ భూమి కోసం ఒక అటవీ అధికారికి, రైతుకు మధ్య ఘర్షణ జరిగింది. నేను దాన్ని ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణగా చూడలేదు.

అడవిని కాపాడే అధికారి, భూమి కోసం పోరాడే రైతు.. ఇద్దరి తాపత్రయం ఒక్కటే. ప్రకృతిని కాపాడే వారి మధ్య ఆ ఘర్షణే నాకు ‘కాంతార’ కథ రాయడానికి స్ఫూర్తిగా నిలిచింది. మన సంస్కృతి మొత్తం వ్యవసాయం చుట్టూ ఎలా తిరుగుతుందో ఆలోచించడం మొదలుపెట్టాను. ఆ క్రమంలో గ్రామీణ సంప్రదాయాల మీద దృష్టిపెట్టి ‘కాంతార’ కథ రాశాను’’ అని రిషబ్ వెల్లడించాడు. కన్నడనాట గ్రామీణ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన భూతకోల నేపథ్యంలో ‘కాంతార’ సాగుతుందన్న సంగతి తెలిసిందే.

This post was last modified on October 5, 2025 11:53 am

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

2 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

3 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

4 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

11 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

12 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

13 hours ago