టాలీవుడ్లో మాంచి స్పీడుతో సినిమాలు చేసే స్టార్ హీరోల్లో మాస్ రాజా రవితేజ ఒకడు. దాదాపుగా ప్రతి ఏడాదీ రవితేజ నుంచి ఒక రిలీజ్ ఉంటుంది. కుదిరితే రెండు సినిమాలను కూడా రిలీజ్ చేస్తుంటాడు. గత ఏడాది ఈగల్, మిస్టర్ బచ్చన్ చిత్రాలతో పలకరించాడు మాస్ రాజా. కానీ ఈ రెండూ నిరాశపరచడంతో మాస్ రాజా స్పీడు కొంచెం తగ్గింది. తర్వాత ఆయన్నుంచి ‘మాస్ జాతర’ రాబోతోంది.
ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యమై అక్టోబరు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం రిలీజైన మూడు నెలల్లోపే రవితేజ నుంచి ఇంకో సినిమా వచ్చే అవకాశముంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న సినిమానే అది. కొన్ని నెలల కిందట చడీచప్పుడు లేకుండా ఈ సినిమాను మొదలుపెట్టారు. సంక్రాంతి రిలీజ్ లక్ష్యంగా అడుగులు వేశారు.
ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు వచ్చింది. ఇప్పటికీ సంక్రాంతి రిలీజ్ అనే అంటున్నారు కానీ.. పక్కాగా పండక్కి వస్తుందా రాదా అన్నది క్లారిటీ లేదు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇంతకుముందు ‘అనార్కలి’ అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. మాస్ రాజా సినిమాకు ఇలాంటి లేడీ ఓరియెంటెడ్, సాఫ్ట్ టైటిల్ ఏంటా అనుకున్నారు. ఐతే ఇప్పుడు టైటిల్ మారినట్లు తెలుస్తోంది. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అంటూ క్రేజీ టైటిల్ ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
మామూలుగా గుళ్లలో ‘భక్త మహాశయులకు విజ్ఞప్తి’ అంటుంటారు. దాన్ని తీసుకుని ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అని సినిమాకు పేరు పెట్టడం క్రేజీ ఐడియానే. కిషోర్ తిరుమల రైటింగ్ టాలెంట్‌కు ఇది నిదర్శనం. ఈ టైటిల్‌ను బట్టి ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అర్థమవుతోంది. త్వరలోనే టైటిల్‌తో పాటు రిలీజ్ గురించి కూడా అనౌన్స్‌మెంట్ ఇవ్వబోతోందట టీం. మరి ఇప్పటికే మూడు సినిమాలతో హౌస్ ఫుల్ అయినట్లుగా కనిపిస్తున్న సంక్రాంతి సీజన్లోకి మాస్ రాజా కూడా ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి.
This post was last modified on October 5, 2025 1:03 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…