ఎప్పటికప్పుడు ఆధారాల రూపంలో తమ బంధం బయట పడుతున్నా మౌనంగా ఉంటూ వచ్చిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. నిన్న అత్యంత సన్నిహితులు, స్నేహితుల మధ్య జరిగిన ఎంగేజ్ మెంట్ గురించి ఏ ఫోటో బయటికి రాలేదు కానీ, ఖండిస్తూ కూడా ఎలాంటి స్టేట్ మెంట్ లేకపోవడంతో ఈ వార్తకు అనధికారికంగా అఫీషియల్ ముద్ర పడినట్టే. పలు సందర్భాల్లో, విదేశాలకు వెళ్లిన సమయాల్లో, పండగల టైంలో ఒకే చోట తామున్నట్టు రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ సిగ్నల్స్ ఇస్తూ వచ్చారు. ఫాన్స్, మీడియాకు అర్థమైనా సరే వాళ్ళుగా ఎప్పుడు క్లారిటీ ఇవ్వలేదు.
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ కపుల్ గా క్రేజ్ సంపాదించుకున్న ఈ జంట వెనుక మంచి ప్రేమ కథ కూడా ఉంది. 2016లో కిరిక్ పార్టీతో కన్నడలో తెరంగేట్రం మొదలుపెట్టిన రష్మిక మందన్నకు తొలి మూవీనే సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దాని హీరో రక్షిత్ శెట్టితో పరిచయం ఏకంగా నిశ్చితార్థం దాకా వెళ్ళింది. రెండేళ్లకు 2018 తెలుగులో ఛలో అవకాశం రావడం, అది ఘనవిజయం దక్కించుకోవడం జరిగిపోయాయి. ఈలోగానే రక్షిత్ తో చేసుకున్న ఎంగేజ్ మెంట్ ని మ్యూచువల్ అండర్ స్టాండింగ్ మీద రద్దు చేసుకున్న రష్మికకు అదే సమయంలో జీవితాన్ని మలుపు తిప్పిన గీత గోవిందం ఆఫర్ తలుపు తట్టింది.
విజయ్ దేవరకొండతో జట్టు కట్టిన మూవీనే ఇండస్ట్రీ హిట్ కావడం ఇంకో శుభ పరిమాణం. ఇక్కడ మొదలైన ఈ ప్రేమకథ మరుసటి ఏడాది డియర్ కామ్రేడ్ తో మరింత బలపడింది. అక్కడి నుంచి ఏడేళ్ల పాటు సైలెంట్ గా ప్రేమించుకున్నారు తప్పించి పెళ్లి గురించిన ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడ్డారు. క్రమంగా యానిమల్, చావా లాంటి బ్లాక్ బస్టర్స్ ద్వారా రష్మికకు బాలీవుడ్ మార్కెట్ వచ్చేసింది. ఫ్లాపుల్లో ఉన్నా సరే విజయ్ దేవరకొండకు పెద్ద సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఏదైతేనేం మరో తెలుగు సినిమా ప్రేమజంట నిజ జీవితంలో భార్యాభర్తలు కాబోతున్నారు. ఫిబ్రవరి చివర్లో ఈ లాంఛనం ఉండొచ్చని టాక్.
Gulte Telugu Telugu Political and Movie News Updates