బెల్లంకొండ శ్రీనివాస్ ఇంకా తెలుగు సినిమా మార్కెట్‍లోనే సరిగా నిలదొక్కుకోలేదు. వరుస ఫ్లాపుల తర్వాత రాక్షసుడు సినిమా ఒక మాదిరిగా ఆడిందంతే. ఇలాంటి టైమ్‍లో అతను బాలీవుడ్ ఎంట్రీపై దృష్టి పెట్టాడు. ప్రభాస్‍ని మాస్ హీరోగా మలచిన ‘ఛత్రపతి’ చిత్రాన్ని హిందీలో చేయాలని డిసైడ్ అయ్యాడు.
ఇందుకోసం తనను ‘అల్లుడు శీను’గా పరిచయం చేసిన వినాయక్‍ను దర్శకుడిగా ఎంచుకున్నాడు. అయితే ఇప్పుడు ఇతగాడికి బాలీవుడ్ మీద దృష్టి ఎందుకనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇంకా తెలుగునాట స్టడీ మార్కెట్ లేకుండా పక్క చూపులు దేనికని అడిగేవాళ్లు చాలా మందే వున్నారు. అయితే దీని వెనకో స్ట్రాటజీ వుందట.
బెల్లంకొండ నటించిన తెలుగు సినిమాల హిందీ అనువాదాలకు చాలా వ్యూస్ వస్తుంటాయి. అతని ప్రతి సినిమాకు హిందీ డబ్బింగ్ రైట్స్ మంచి ధర పలుకుతుంటాయి. అసలు హిందీలో స్ట్రెయిట్ సినిమా చేయకుండానే ఇంత క్రేజ్ వుంటే ఇక డైరెక్ట్ సినిమా చేస్తే ఎలాగుంటుందని ఆలోచించారట.
ఒకవేళ ఈ ఛత్రపతి రీమేక్ క్లిక్ అయితే ఇక మీదట తన సినిమాలను తెలుగు, హిందీ భాషలలో ఒకేసారి చేసుకోవచ్చునని, తద్వారా తన మార్కెట్ మరింత పెరుగుతుందని అతను భావిస్తున్నాడట. అయితే వినాయక్‍తో బైలింగ్వల్ ప్లాన్ చేయకుండా ఇలా అచ్చంగా హిందీ సినిమానే చేస్తే తెలుగులో అంతవరకు సినిమా లేక గ్యాప్ వచ్చేస్తుంది కదా. ఇది కూడా ఓసారి ఆలోచించుకుని దిగితే బాగుండేది.
This post was last modified on November 27, 2020 1:46 pm
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…