అఖిల్ హలోతో టాలీవుడ్ కు పరిచయమైన కళ్యాణి ప్రియదర్శన్ టైటిల్ రోల్ పోషించిన లోకా చాప్టర్ 1 విడుదలైన అయిదు వారాలవుతున్నా బాక్సాఫీస్ దగ్గర దూకుడు కొనసాగిస్తునే ఉంది. ఇప్పటికీ గంటకు బుక్ మై షోలో 1300కు పైగా టికెట్లు అమ్ముడుపోవడం మాములు విషయం కాదు. దీనికి పోటీగా వచ్చిన మోహన్ లాల్ హృదయపూర్వం అప్పుడే ఓటిటిలో వచ్చేయగా లోకా మాత్రం ఇప్పట్లో డిజిటల్ రిలీజయ్యే సమస్యే లేదంటోంది. పాత రెకార్డులంన్నీ బద్దలు కొట్టిన లోకా చాప్టర్ 1 అతి త్వరలో 300 కోట్ల క్లబ్బులో అడుగు పెట్టనుంది. ఇది జరిగితే సరికొత్త చరిత్ర లిఖితమవుతుంది. వీకెండ్ లోపు అయిపోవచ్చు.
ఇదిలా ఉండగా లోకా ఖాతాలో మరో మైలురాయి చేరుకుంది. కేరళలో అత్యధిక ఫుట్ ఫాల్స్ (థియేటర్ కు వచ్చిన జనాల సంఖ్య) రాబట్టిన సినిమాగా కొత్త రికార్డు ఖాతాలో వేసుకుంది. 1 కోటి 18 లక్షలకు పైగా ఫుట్ ఫాల్స్ లోకా పేరు మీద నమోదయ్యాయి. దీని తర్వాతి స్థానాల్లో మంజుమ్మల్ బాయ్స్, పులి మురుగన్, తుడరమ్ ఉన్నాయి. ఎంపురాన్ కంటే ఇవి పెద్ద నెంబర్స్ కావడం గమనార్హం. నిర్మాత దుల్కర్ సల్మాన్ కు ఊహించని విధంగా లాభాల వర్షం కురిపించిన లోకా ఈజీగా యాభై రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ సిరీస్ లో రెండో భాగం టోవినో థామస్ హీరోగా ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.
విచిత్రం ఏమిటంటే లోకాకి ఇతర భాషల్లో భారీ స్పందన దక్కలేదు. తెలుగులో మొదటి రెండు మూడు రోజులు హడావిడి చేసి కాసిన్ని వసూళ్లు రాబట్టింది కానీ తర్వాత హఠాత్తుగా చల్లబడిపోయింది. కారణం కంటెంట్ మనకు పూర్తిగా కనెక్ట్ కాలేకపోవడమే. సితార డిస్ట్రిబ్యూషన్ వల్ల మంచి రిలీజ్ దక్కించుకుంది కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. కాకపోతే తక్కువ మొత్తానికి కొనడంతో నష్టాలు రావడం లాంటి ఇబ్బందులు కలగలేదు. తమిళం, కన్నడ, హిందీలోనూ లోకకు పెద్ద రెస్పాన్స్ లేదు. ఏదైతేనేం ఒక రీజనల్ మూవీ కేవలం ఒకే భాషలో ఇంత పెద్ద ఎత్తున రికార్డులు సాధించడం విశేషమే.
This post was last modified on October 2, 2025 7:07 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…