వాయిదాలు పడుతూ వస్తున్న మాస్ జాతర ఎట్టకేలకు విడుదల తేదీ దక్కించుకుంది. అక్టోబర్ 31 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు సితార ఎంటర్ టైన్మెంట్స్ ప్రకటించింది. అదే రోజు బాహుబలి ఎపిక్ తప్ప చెప్పుకోదగ్గ కాంపిటీషన్ లేకపోవడంతో ఫైనల్ గా లాక్ చేసుకుంది. అయితే పోస్ట్ పోన్ల పర్వం పెద్ద హీరోలకు మాములే కానీ మాస్ జాతరకు కొన్ని సవాళ్లు ఎదురు చూస్తున్నాయి. వాటిలో మొదటిది హైప్ పెంచడం. ఇప్పటిదాకా వచ్చిన టీజర్, లిరికల్ సాంగ్స్ పెద్దగా మేజిక్ చేయలేకపోయాయి. ఒక పాటలో బూతులు ఎక్కువయ్యాయంటూ విమర్శలు కూడా వచ్చాయి.
దర్శకుడు భాను భోగవరపుకి ఇది మొదటి సినిమా. స్టార్ రైటర్ గా ఇండస్ట్రీలో పేరుంది కానీ డెబ్యూ కాబట్టి డైరెక్టర్ గా తన మీద ఒత్తిడి చాలానే ఉంటుంది. అందులోనూ అంచనాల పరంగా ఇప్పటిదాకా మాస్ జాతర ఎలాంటి సౌండ్ చేయలేదు. రవితేజ ఎనర్జీ ప్రమోషన్ మెటీరియల్ లో కనిపిస్తోంది కానీ ఇది రొటీన్ స్టోరీనేమోననే టెన్షన్ ఫ్యాన్స్ లో లేకపోలేదు. అయితే ఎలివేషన్, టెంపో సరైన మోతాదులో ఉంటే హిట్టవ్వొచ్చని ఇటీవలే ఓజి నిరూపించింది. తెలిసిన కథనే దర్శకుడు సుజిత్ హ్యాండిల్ చేసిన విధానం మాస్ కి నచ్చేసింది. ఇప్పుడు భాను భోగవరపు కూడా అదే తరహాలో మెప్పించాల్సి ఉంటుంది.
అసలే రవితేజకు వరస ఫ్లాపులు ఇబ్బంది పెడుతున్నాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్నాడు. ధమాకా, వాల్తేరు వీరయ్య తప్ప గత రెండేళ్లలో మాస్ మహారాజాకు సక్సెస్ లేదు. ప్రయోగాలు పోయాయి. రెగ్యులర్ ఫార్ములాలూ పని చేయలేదు. దీనికి తోడు నిర్మాత నాగవంశీ సైతం హిట్టు కోసం తపిస్తున్నారు. కింగ్ డమ్ డిజాస్టర్, వార్ 2 డిస్ట్రిబ్యూషన్ రెండూ నష్టాలు తెచ్చి పెట్టాయి. కోలుకోవడానికి ఛాన్స్ ఇవ్వాల్సింది మాస్ జాతరే. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ ఎంటర్ టైనర్ కు భీమ్స్ సిసిరోలియో సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది. ఫ్యాన్స్ ఆకలి తీరుతుందనే నమ్మకం టీమ్ వ్యక్తం చేస్తోంది.
This post was last modified on October 1, 2025 6:33 pm
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…