గత రెండు రోజులుగా సోషల్ మీడియాని ఊపేసిన టాపిక్స్ లో కాంతార హీరో రిషబ్ శెట్టి హైదరాబాద్ ఈవెంట్ లో కన్నడలో మాట్లాడిన స్పీచ్ బాగా తిరిగింది. అంతో ఇంతో తెలుగు వచ్చినప్పటికీ అసలా భాషే రాదనే రీతిలో ప్రసంగించడం బ్యాక్ ఫైర్ అయ్యింది. కొందరు ఏకంగా బాయ్ కాట్ నినాదం తలకెత్తుకోవడంతో జరుగుతున్న డ్యామేజ్ గుర్తించిన రిషబ్ అనుకున్నట్టే విజయవాడ వేడుకలో దానికి చెక్ పెట్టేశాడు. తెలుగు కన్నడ భాషలు సోదరుల్లాంటివని, ఒక కన్నడిగుడు ఎప్పుడు ఇతర బాషలను ప్రేమిస్తాడని, తనకు ఎలాంటి వ్యత్యాసం లేదని, కేవలం పట్టు లేకపోవడం వల్లే పొరపాట్లు జరుగుతాయనే రీతిలో క్లారిటీ ఇచ్చేశాడు.
అంతేకాదు జై హనుమాన్ లో నటించే సమయంలో తెలుగుని ఇంకా బాగా నేర్చుకుంటానని నిర్మాత మైత్రి రవిని ఉద్దేశించి చెప్పడంతో ఫ్యాన్స్ చప్పట్లు కొట్టారు. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబునాయుడులకు సభా వేదికగా కృతజ్ఞతలు చెప్పిన రిషబ్ క్లుప్తంగా మాట్లాడ్డం గమనార్హం. కన్నడలో అయితే ఎక్కువ సేపు విశేషాలు పంచుకోవడానికి ఛాన్స్ ఉండేది కానీ మళ్ళీ వ్యతిరేకత మూటగట్టుకోవడం ఇష్టం లేక తెలుగుకే పరిమితం కావడం విశేషం. అంటే సోషల్ మీడియా ప్రభావం, అందులో జరిగిన ట్రోలింగ్ రిషబ్ శెట్టి దృష్టికి బలంగా వచ్చినట్టు ఉంది. ముంబైలోనూ దీని ప్రస్తావన తెచ్చారు.
ఇంకొక్క రోజులో కాంతారా చాప్టర్ 1 ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవోలు ఆలస్యం కావడంతో అడ్వాన్స్ బుకింగ్స్ లేట్ గా మొదలుపెట్టిన కాంతారా చాప్టర్ 1 టీమ్ రేపు రాత్రి టాక్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే ఈ షోలు చెప్పిన టైం ప్రకారం పది గంటలకు ఉంటాయా లేక రద్దు చేస్తారా అనే టాక్ ట్రేడ్ వర్గాల్లో తిరుగుతోంది. టైం తక్కువగా ఉండటంతో వేయాలా వద్దా అనే మీమాంసలో డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నట్టు సమాచారం. భారీ అంచనాలు, ఏపీలో టికెట్ రేట్ల పెంపు, ఒక వర్గం తెలుగు ఆడియన్స్ నిరసనల మధ్య బరిలో దిగుతున్న కాంతార అంచనాలకు మించి ఉంటేనే బ్లాక్ బస్టర్ అందుకుంటుంది.
This post was last modified on October 1, 2025 5:06 am
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…