ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిధిగా విచ్చేసిన కాంతార ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి పూర్తి కన్నడలో మాట్లాడ్డం, సోషల్ మీడియాలో వివాదానికి దారి తీయడం చూస్తున్నాం. అది ఏకంగా బాయ్ కాట్ కాంతార అని పిలుపు ఇచ్చే దాకా వెళ్లిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తన ఉద్దేశంలో తప్పు లేకపోవచ్చు కానీ భాషని ఎంచుకోవడంలో చేసిన పొరపాటు వల్ల ఏకంగా ఓపెనింగ్స్ మీద ప్రభావం పడేలా చేసింది. పైగా ఏపీ ప్రభుత్వం కాంతార టికెట్ ధరల పెంపుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మరో రకమైన వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఇదంతా అర్జెంట్ గా రిపేర్ చేయాల్సిన డ్యామేజ్.
ఈ నేపథ్యంలో ఇవాళ విజయవాడలో జరగబోయే ఈవెంట్ లో మరోసారి రిషబ్ శెట్టి మాట్లాడబోయే సందర్భం రానుంది. గొల్లపూడి ఎక్స్ పో గ్రౌండ్స్ లో జరగనున్న వేడుక ద్వారా రిషబ్ శెట్టి జరిగిన దానికి వివరణ ఇచ్చే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల పెంపు రావడానికి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవడంతో ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు తానెందుకు కేవలం కన్నడలోనే మొన్న ఈవెంట్ లో మాట్లాడాల్సి వచ్చిందో కొంచెం ఎక్స్ ప్లనేషన్ ఇవొచ్చు. నిజానికి రిషబ్ శెట్టికి ఓ మోస్తరుగా తెలుగు వచ్చు. ధారాళంగా కాకపోయినా కొద్దికొద్దిగా మాట్లాడగలడు. అది చాలు ఆడియన్స్ ని కూల్ చేయడానికి.
బజ్ ఎంత ఉందనేది పక్కన పెడితే కాంతార ఓపెనింగ్స్ సినిమా ఫలితంలో కీలక పాత్ర పోషించనున్నాయి. మొదటి భాగం టైంలో అంచనాలు లేవు. థియేటర్ బిజినెస్ తక్కువకు చేశారు. కన్నడ వెర్షన్ తో పోలిస్తే రెండు వారాలు ఆలస్యంగా తెలుగులో రిలీయ్యింది. అయినా సరే బ్లాక్ బస్టర్ విజయం దక్కింది. కానీ కాంతార చాప్టర్ 1 నాటికి లెక్కలు మారిపోయాయి. రేట్ అమాంతం పెరిగింది. మైత్రి సంస్థ హక్కులు సొంతం చేసుకుంది. ఏకంగా టికెట్ రేట్లు ఎక్కువ చేయమని అడిగే రేంజ్ లో ఉంది. సో ఈ ప్రశ్నలు అన్నింటికి కాకపోయినా కొన్నింటికి రిషబ్ శెట్టి వైపు సమాధానం వచ్చే ఛాన్స్ ఇవాళ ఉంది. చూద్దాం.
This post was last modified on September 30, 2025 12:25 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…