ఈ మధ్య ఓటీటీల్లో రిలీజైన తెలుగు చిత్రాలు.. కలర్ ఫోటో, మిస్ ఇండియా, మిడిల్ క్లాస్ మెలొడీస్. ఈ మూడు చిత్రాల్లో కామన్‌గా కనిపించే విషయం ఒకటుంది. ఆ విషయం పేరు.. దివ్య శ్రీపాద. ఈ కొత్తమ్మాయి ఈ మూడు చిత్రాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించిన సంగతి చాలామంది గుర్తించి ఉండరు. చాలా సింపుల్‌గా కనిపిస్తూనే సహజమైన అందం, అభినయంతో ఆకట్టుకుంటోందీ అమ్మాయి.
సినిమాలు మాత్రమే చూసే జనాలకు ఈ అమ్మాయి కొత్తగా అనిపించొచ్చు కానీ.. షార్ట్ ఫిలిమ్స్ ఫాలో అయ్యేవాళ్లకు దివ్య బాగానే పరిచయం. పలు షార్ట్ ఫిలిమ్స్‌తో సత్తా చాటిన ఈ అమ్మాయి.. ఆ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన ఫిలిం మేకర్ల దృష్టిలో పడి వరుసగా అవకాశాలు అందుకుంటోంది. ప్రతి అమ్మాయి హీరోయిన్ కావాలనే అనుకుంటుంది కానీ.. దివ్య మాత్రం పాత్ర ప్రాధాన్యాన్ని బట్టి సహాయ పాత్రలు చేయడానికి కూడా సై అంది. అదే ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది.
ఒక కొత్తమ్మాయి సహాయ పాత్రలు పోషించిన మూడు సినిమాలు నెల వ్యవధిలో వరుసగా ఓటీటీల్లో రిలీజవడం, వాటితో ఆమెకు మంచి పేరు రావడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ‘కలర్ ఫోటో’లో హీరోయిన్‌తో పాటే ఉంటూ చాలా స్క్రీన్ టైం పొందిన దివ్య.. తన సింప్లిసిటీతో ప్రేక్షకులపై బలమైన ముద్రే వేసింది. ‘మిస్ ఇండియా’లో సైతం హీరోయిన్ కీర్తి స్నేహితురాళ్లలో ఒకరిగా దివ్య సత్తా చాటుకుంది.
ఇప్పుడు ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’లో దివ్య మరింతగా హైలైట్ అయింది. హీరోయిన్ వర్ష బొల్లమ్మను మించి ఈమె ఈ సినిమాలో ప్రత్యేకతను చాటుకోవడం విశేషం. హీరోయిన్ పాత్ర కంటే దివ్య క్యారెక్టరే ప్రత్యేకంగా అనిపిస్తుంది. తాగుబోతు తండ్రి చెప్పినట్లు ఒక రోగ్‌ను పెళ్లి చేసుకోలేక, నచ్చిన అబ్బాయికి తన ప్రేమను చెప్పలేక సతమతం అయ్యే పేదింటి అమ్మాయిగా ఆమె నటన కట్టి పడేస్తుందీ చిత్రంలో. ఈ సినిమా చూశాక ఎవరీ అమ్మాయి అని ఆరా తీయడం మొదలుపెడుతున్నారు జనాలు. త్వరలో ఆమె హీరోయిన్ పాత్రలు వేసినా ఆశ్చర్యం లేదేమో.
This post was last modified on November 26, 2020 4:40 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…