విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు స్లమ్ డాగ్ పేరుని ఖరారు చేశారు. ఇవాళ అఫీషియల్ గా టైటిల్ లాంచ్ ఈవెంట్ చెన్నైలో జరగాల్సి ఉంది. విజయ్ రాజకీయ పర్యటనలో రేగిన రద్దీ వల్ల నలభై మంది ప్రాణాలు కోల్పోవడంతో దాన్ని వాయిదా వేశారు. పేరు నిన్నే లీకైపోవడంతో ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ కం ఎమోషన్ డ్రామాలో టబూ ఒక ప్రధాన పాత్ర పోషిస్తుండగా వీరసింహారెడ్డితో పరిచయమైన కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ గా నటిస్తున్నాడు. సెటప్ అంతా చాలా నీట్ గా కనిపిస్తోంది.
అంతర్గత సమాచారం ప్రకారం స్లమ్ డాగ్ పక్కా పూరి వింటేజ్ స్టైల్ లో ఉంటుందట. అంటే ఆ మధ్య వచ్చిన కుబేరలో బిచ్చగాడు వ్యవస్థనే శాశించే మిలియనీర్ గా ఎలా మారాడనే పాయింట్ నే తీసుకున్నా దానికి పోకిరి తరహా మాస్ ట్రీట్ మెంట్ తో బిజినెస్ మెన్ టైప్ ట్విస్టులతో ఫ్యాన్స్ కి కిక్ ఇవ్వడం ఖాయమని అంటున్నారు. బ్యాక్ డ్రాప్ కొంచెం దగ్గరగా అనిపించినా కథాపరంగా కుబేర, స్లమ్ డాగ్ కు ఎక్కడా పోలికే ఉండదని అంటున్నారు. ముఖ్యంగా విజయ్ సేతుపతిలోని కంప్లీట్ యాక్టర్ మరోసారి దీని రూపంలో బయటికి వస్తాడని అంటున్నారు. షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయిపోయింది.
లైగర్, డబుల్ ఇస్మార్ట్ తర్వాత పూరి జగన్నాథ్ కు కంబ్యాక్ చాలా కీలకం కానుంది. టాలీవుడ్ స్టార్ హీరోలతో ఛాన్స్ దొరకడం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన స్థాయి నుంచి రెండు డిజాస్టర్లకే వెనుబడిన పరిస్థితి రావడంతో ఈసారి చాలా కసితో ఉన్నారట. అందుకే ట్రాక్ రికార్డు పట్టించుకోకుండా స్లమ్ డాగ్ వినగానే విజయ్ సేతుపతి అంగీకారం తెలిపినట్టుగా చెబుతున్నారు. విడుదల విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదట. తెలుగు, తమిళ మార్కెట్లకు అనుగుణంగా రెండు చోట్లా మంచి రిలీజ్ దక్కేలా డేట్ కోసం చూస్తున్నారు. ఈ ఏడాది చివరిలో క్రిస్మస్ డేట్ పరిశీలనలో ఉంచినట్టుగా తెలిసింది.
This post was last modified on September 28, 2025 5:23 pm
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…
ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…