ప్రభాస్ నటించిన మొదటి హారర్ డ్రామా ‘ది రాజా సాబ్’ జనవరి 9 విడుదలని అధికారికంగా ప్రకటించనప్పటికీ ఇది ఫిక్స్ కావడం అభిమానుల నుంచి సామాన్య ప్రేక్షకుల దాకా అందరికీ తెలిసిన విషయమే. ఇంకా మూడు నెలలకు పైగానే టైం ఉంది. కానీ ప్రమోషన్ల విషయంలో చాలా అడ్వాన్స్ గా ఉండటం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. మాములుగా డార్లింగ్ టీమ్స్ నుంచి వచ్చే అప్డేట్స్ ఆలస్యమవుతాయి. చెప్పిన టైం, డేట్ కి కట్టుబడలేక సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురైన సందర్భాలు లేకపోలేదు. అఫ్కోర్స్ రాజా సాబ్ సైతం వాయిదాల పర్వంలో నలిగిందే కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది.
ఆల్రెడీ మూడు నిమిషాల టీజర్ అందుబాటులో ఉండగా కొత్తగా మరో మూడున్నర నిమిషాల ట్రైలర్ ని రేపు రిలీజ్ చేయబోతున్నారు. డిసెంబర్ లో చేయాల్సిన లాంఛనం ఇప్పుడెందుకనే అనుమానం రావడం సహజం. దానికి సమాధానం ఉంది. ది రాజా సాబ్ బిజినెస్ ఇంకా మొదలుపెట్టలేదు. నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఎంత క్రేజీ ఆఫర్లు వస్తున్నా సరే చలించడం లేదట. ట్రైలర్ చూశాక అంచనాలు పెరిగిపోయి బిజినెస్ పరంగా మరింత ఉపయోగపడటమే కాకుండా, బాలీవుడ్ మార్కెట్ ని లక్ష్యంగా పెట్టుకుని అక్కడ డిమాండ్ ని అమాంతం పెంచేలా వేసుకున్న స్ట్రాటజీలో ఇది భాగమని అంటున్నారు.
రాజా సాబ్ కు ప్రభాస్ ఇమేజ్ ప్రధాన బలం. ఎందుకంటే దర్శకుడు మారుతీకి తెలుగు మార్కెట్ లో గుర్తింపు ఉంది కానీ ఉత్తరాదిలో అవహగాన తక్కువ. సో ఆయన బ్రాండ్ మీద రేట్లు డిసైడ్ కావు. తమన్ సంగీతం, సంజయ్ దత్ పాత్ర, హిందీలో బాగా వర్కౌట్ అవుతున్న హారర్ జానర్ ఇవన్నీ రాజా సాబ్ కు సానుకూలంగా మారబోతున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరలో ఉన్నప్పుడు మరో ట్రైలర్ వదులుతారట. ప్రభాస్ పుట్టినరోజుకు మొదటి ఆడియో సింగల్ ని రెడీ చేస్తున్నారు. కొత్త పోస్టర్లు కూడా రాబోతున్నాయి. ఇంత పక్కా ప్లాన్ ఉండబట్టే రాజా సాబ్ పబ్లిసిటీ విషయంలో పరుగులు పెడుతూ బజ్ పెంచుకుంటున్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates