బాహుబలి ఎపిక్ రీ రిలీజ్ వేళ కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. వాటిలో ప్రధానంగా కట్టప్ప బ్యాక్ స్టోరీని ఒక సినిమాగా తీసే ప్లాన్ లో విజయేంద్ర ప్రసాద్ ఉన్నట్టుగా తిరుగుతున్న న్యూస్ మీద ఫ్యాన్స్ లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మాహిష్మతి సామ్రాజ్యానికి కట్టప్ప ఎందుకు బానిసగా మారాడు, అంత విధేయత చూపడం వెనుక రీజన్ ఏంటి లాంటి ప్రశ్నలకు సమాధానం ఇందులో చూడొచ్చు. అయితే సత్యరాజ్ ని సోలో హీరోగా పెట్టి ఇంత పెద్ద కాన్వాస్ మీద సినిమా తీస్తే ఎంత మేరకు వర్కౌట్ అవుతుందనేది అనుమానమే. ఎందుకంటే కట్టప్ప ఫ్లాష్ బ్యాక్ కాబట్టి అందులో ప్రభాస్, అనుష్క, రానాలు ఉండరు.
ముందు స్క్రిప్ట్ పూర్తి చేసి ఆ తర్వాత క్యాస్టింగ్, దర్శకత్వ బాధ్యతలు ఎవరికి ఇవ్వాలనే దాని మీద నిర్ణయం తీసుకుంటారట. అయితే ఇప్పుడు కట్టప్ప మీద జనంలో అంత ఎగ్జైట్ మెంట్ ఉందా అంటే డౌటే. ఇప్పటికే బాహుబలిని వందలసార్లు టీవీ, ఓటిటిలో ఆడియన్స్ చూసేశారు. ఎపిక్ తో మరోసారి రెండు భాగాలను ఒకే దాంట్లో చూడబోతున్నారు. ఈ ప్యాన్ ఇండియా మూవీని ఈ స్థాయికి పుష్ చేసింది ముమ్మాటికీ ప్రభాస్, రాజమౌళిలే. వాళ్ళు లేకుండా కట్టప్పని ఇంకొకరి చేతిలో పెడితే అవుట్ ఫుట్ ఎలా ఉంటుందో మరి. సత్యరాజ్ అయితే ఐడియా వినగానే ఎప్పుడెప్పుడు చేద్దామా అని అడుగుతున్నారట.
ప్రస్తుతం రాజమౌళి చేతిలో రెండు పెద్ద బాధ్యతలు ఉన్నాయి. మొదటిది బాహుబలి ఎపిక్ ఫైనల్ కట్ ని చూసి ఫిక్స్ చేయడంతో పాటు ప్రమోషన్లు, మార్కెటింగ్ చూసుకోవడం. ఈసారి డాల్బీ విజన్, అట్మోస్ లాంటి ఆధునిక సాంకేతికతల జోడించారు కాబట్టి విజువల్ ఎక్స్ పీరియన్స్ డిఫరెంట్ గా ఉంటుంది. కొత్త సినిమా రేంజ్ లో హడావిడి ఉంటుందని బయ్యర్లు భావిస్తున్నారు. ఎందుకంటే కల్కి వచ్చి ఏడాది దాటేసింది. కన్నప్పలో క్యామియో కాబట్టి ఫాన్స్ మొదటి రోజు చూసేసి లైట్ తీసుకున్నారు ఈసారి సంబరాలు గట్టిగా ఉంటాయి..రెండో రెస్పాన్సిబిలిటీ ఎస్ఎస్ఎంబి 29 తాలూకు పనులకు బ్రేక్ లేకుండా చూసుకోవడం.
This post was last modified on September 27, 2025 9:25 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…