టాలీవుడ్లో వయసుతో సంబంధం లేకుండా చాలా ట్రెండీగా కనిపించే హీరోల్లో అక్కినేని నాగార్జున ఒకరు. ఆయన ఆహార్యం మాత్రమే కాదు.. ఆలోచనలు కూడా ట్రెండుకు తగ్గట్లే ఉంటాయి. ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు వచ్చే మార్పులకు అనుగుణంగా ఆయన తనను తాను మార్చుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన ట్రెండుకు తగ్గట్లుగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి.
తన కొత్త చిత్రం ‘వైల్డ్ డాగ్’ను డిజిటల్ రిలీజ్‌కు ఇచ్చేయడానికి నాగ్ రెడీ అయినట్లు సమాచారం. ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారని కొన్ని నెలల కిందటే వార్తలొచ్చాయి. కానీ అందుకు నాగ్ ఏమాత్రం ఆసక్తిగా లేడన్నారు. కానీ ఇప్పుడు ఆయన ఆలోచనలు మారిపోయాయి. థియేటర్లు పున:ప్రారంభం అవుతున్నప్పటికీ అవి సాధారణ స్థాయిలో ఎప్పుడు నడుస్తాయో తెలియట్లేదు. పైగా లెక్కలేనన్ని సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాయి.
ఈ సినిమాలన్నీ కూడా వడ్డీల భారాన్ని మోస్తూ.. పరిస్థితులు ఎప్పుడు బాగుపడతాయా అని చూస్తున్నాయి. థియేటర్లు 100 శాతం ఆక్యుపెన్సీతో, మునుపటిలా నడవడం మొదలైతే రిలీజ్ కోసం కొట్లాటలు తప్పవు. నిర్మాతల మధ్య పంచాయితీలు తప్పవు. అలాంటపుడు ఈ ఏడాది వేసవి సమయం నుంచి ఎదురు చూస్తున్న చిత్రాలకే ముందు అవకాశం కల్పిస్తారు. ఈ మధ్యే పూర్తయిన చిత్రాలు వెనక్కి వెళ్లక తప్పదు. వేసవికి కూడా మోక్షం లభిస్తుందన్న గ్యారెంటీ లేదు. ఆ సీజన్ కోసం ఆల్రెడీ భారీ చిత్రాలు ఎదురు చూస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అన్ని విషయాలనూ పరిగణనలోకి తీసుకుని ‘వైల్డ్ డాగ్’ను ఓటీటీలో వదిలేయడానికి నాగ్ నిర్ణయించుకున్నారట. నెట్ ఫ్లిక్స్ వాళ్లు ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి ఈ సినిమాను సొంతం చేసుకోవడానికి ముందుకు వచ్చారట. వంద కోట్ల బిజినెస్ అయ్యే అవకాశమున్న ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రాన్ని సూర్య అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేసేసిన నేపథ్యంలో తమ చిత్రాన్ని డిజిటల్ రిలీజ్ చేయడంలో తప్పేముందని నాగ్ భావిస్తున్నాడట. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ‘వైల్డ్ డాగ్’కు సాల్మన్ దర్శకుడు. త్వరలోనే ఈ సినిమా డిజిటల్ రిలీజ్ గురించి ప్రకటన రావచ్చని భావిస్తున్నారు.
This post was last modified on November 26, 2020 2:05 pm
దేశ భద్రతపై మళ్లీ శాంతిభంగం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయని నిఘా సంస్థలు హెచ్చరించాయి. శనివారం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు…
రెండేళ్ల క్రితం బేబీ రిలీజ్ ముందు వరకు తనెవరో పెద్దగా పరిచయం లేని పేరు. అల వైకుంఠపురములో అల్లు అర్జున్…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ... అధికార డీఎంకేలో ఫుల్ జోష్ నింపే పరిణామం ఒకటి శనివారం జరిగింది. సుప్రీంకోర్టులో రెండేళ్లుగా…
హర్యానాలోని సోనిపట్‌లో ఉన్న ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.…
మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు.. తాజాగా అటు తెలంగాణ, ఇటు ఏపీ నేతలపై సెటర్లు గుప్పించారు.…
కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. టాక్ తేడాగా వచ్చినా, జనానికి పూర్తిగా నచ్చకపోయినా కలెక్షన్లు మాత్రం భీభత్సంగా వచ్చేస్తాయి.…