Movie News

లిటిల్ హార్ట్స్… లేదు లేదంటూనే

చిన్న సినిమాల్లో పెద్ద సంచ‌ల‌నంగా నిలిచిన చిత్రం.. లిటిల్ హార్ట్స్. కేవ‌లం రెండున్న‌ర కోట్ల బ‌డ్జెట్లో తెర‌కెక్కిన ఈ సినిమా.. ఏకంగా 45 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఘాటి, మ‌ద‌రాసి లాంటి పెద్ద సినిమాల‌కు పోటీగా రిలీజైన లిటిల్ హార్ట్స్.. వాటిని వెన‌క్కి నెట్టి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల పంట పండించుకుంది. పెద్ద సినిమాలు కూడా వారం త‌ర్వాత స్లో అయిపోతున్న రోజుల్లో.. మూడు వారాల పాటు ఈ సినిమా మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చిత్రం ఓజీ వ‌చ్చాక కానీ లిటిల్ హార్ట్స్ జోరు తగ్గ‌లేదు.

థియేట‌ర్ల‌లో ఈ సినిమాను చూడ‌లేక‌పోతున్న వాళ్లు.. ఓటీటీలో చూద్దామ‌ని ఎదురు చూస్తున్నారు. ఐతే అక్టోబ‌రు 1న ఈ చిత్రం డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు రాబోతోంద‌ని ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో ఎవ‌రో పోస్టు పెడితే.. అది నిజం కాదంటూ దీని నిర్మాణంలో భాగ‌మైన ఈటీవీ విన్ నుంచి రిప్లై వ‌చ్చింది. త‌మ సినిమాకు హౌస్ ఫుల్స్ ప‌డుతున్నాయ‌ని, ఇప్పుడిప్పుడే ఓటీటీలో రిలీజ్ చేయ‌మ‌ని ఈటీవీ విన్ ఎక్స్ హ్యాండిల్లో ప్ర‌క‌టించారు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఈటీవీ విన్ స్వ‌యంగా లిటిల్ హార్ట్స్ డిజిట‌ల్ స్ట్రీమింగ్ డేట్‌ను ప్ర‌క‌టించింది. ఇంత‌కుముందు ప్ర‌చారం జ‌రిగిన డేట్‌కే ఈ సినిమా ఓటీటీలోకి రానుండ‌డం విశేషం. అక్టోబ‌రు 1 నుంచి లిటిల్ హార్ట్స్ స్ట్రీమ్ అవుతుంద‌ని ఈటీవీ విన్ ప్ర‌క‌టించింది. ఐతే స్ట్రీమింగ్ విష‌యంలో చిన్న ట్విస్ట్ ఇచ్చారు. థియేట‌ర్ల‌లో లేని అద‌నపు స‌న్నివేశాల‌తో రాబోతోంద‌ట ఓటీటీ వెర్ష‌న్.

ఇది ఎక్స్‌టెండెడ్ వెర్ష‌న్ అని డిజిట‌ల్ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ సంద‌ర్భంగా ఈటీవీ విన్ ప్ర‌క‌టించింది. కాబ‌ట్టి థియేట‌ర్ల‌లో చూసిన వాళ్లు కూడా ఓటీటీలో ఈ సినిమాపై ఓ లుక్కేయ‌డానికి అవ‌కాశ‌ముంది. ఈటీవీ విన్ వెబ్ సిరీస్ నైంటీస్ మిడిల్ క్లాస్‌తో న‌టుడిగా ప‌రిచ‌యం అయిన మౌళి లీడ్ రోల్ చేసిన లిటిల్ హార్ట్స్‌లో అంబాజీపేట మ్యారేజీబ్యాండు ఫేమ్ శివాని న‌గ‌రం క‌థానాయిక‌గా న‌టించింది. నైంటీస్ ద‌ర్శ‌కుడు ఆదిత్య హాస‌న్ నిర్మించిన ఈ సినిమాను సాయిమార్తాండ్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో భాగ‌మైన అంద‌రికీ అవకాశాలు వెల్లువెత్తేలా క‌నిపిస్తోంది.

This post was last modified on September 26, 2025 9:35 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

1 hour ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

2 hours ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

2 hours ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

3 hours ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

3 hours ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

4 hours ago