ఈ మధ్యకాలంలో పోటీ లేకుండా సోలో రిలీజ్ దక్కడం పెద్ద సమస్యగా మారిపోయింది. ముందు ఎవరు ప్రకటించారు లాంటి లెక్కలేమి లేకుండా ఎవరి బిజినెస్ వారిది తరహాలో ప్రొడ్యూసర్లు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో కిష్కిందపురి హీరో, నిర్మాత అపోజిషన్ లో ఉన్న మిరాయ్ మీద అసంతృప్తి వ్యక్తం చేయడం చూశాం. ఇదిలా ఉండగా ఒక బాలీవుడ్ మూవీని కన్నడ సినిమా డామినేట్ చేయడం ఎక్కడైనా చూశామా. కెజిఎఫ్ పుణ్యమాని ఇప్పుడు శాండల్ వుడ్ మేకర్స్ కు రెక్కలు వచ్చేశాయి. బలమైన డిస్ట్రిబ్యూటర్ దొరికితే కండీషన్లు పెట్టే స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ ఉదాహరణ చూడండి.
అక్టోబర్ 2 జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ జంటగా నటించిన సన్నీ సన్సకారి కి తులసి కుమారి విడుదల కానుంది. నిర్మాత కరణ్ జోహార్ కావడంతో పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే కాంతార చాప్టర్ 1 ఉత్తరాదిలో విడుదల చేస్తున్న డిస్ట్రిబ్యూటర్ అనిల్ తదాని తన సినిమా కావాలంటే కొన్ని కండీషన్లు పాటించాల్సిందే అంటున్నాడు. ఉదాహరణకు సింగల్ స్క్రీన్ అయితే కాంతర రోజుకు అయిదు షోలు, మల్టీప్లెక్సులు అయితే ఒక్కో స్క్రీన్ కు కనీసం నాలుగు నుంచి ఆరు షోలు పడేలా డిమాండ్ చేస్తున్నారట. ఆమేరకు ఎగ్జిబిటర్లకు అఫీషియల్ మెయిల్ వచ్చిందని ఇన్ సైడ్ టాక్.
ఇదే జరిగితే థియేటర్లు తక్కువగా ఉండే కింది సెంటర్లలో సన్నీ సన్సాకారికి తులసి కుమారికి సింగల్ డిజిట్ షోలు పడతాయి. అసలే బజ్ పరంగా వెనుకబడి ఉంది. ట్రైలర్ ద్వారా ఎంటర్ టైమెంట్ మూవీ అనే హామీ ఇచ్చారు కానీ చాలా సందర్భాల్లో అవి నిజమైన దాఖలాలు లేవు. పైగా జాన్వీ కపూర్ ట్రాక్ రికార్డు కూడా అంతంత మాత్రంగానే ఉంది. ప్రమోషన్లైతే బలంగా చేస్తున్నారు. అనిల్ తదాని నియంత్రణ లేని థియేటర్లలో సన్నీకి ఇబ్బందులు లేవు. కానీ తన నెట్ వర్క్ లో ఉన్న థియేటర్లను కరణ్ బ్లాక్ చేసే పనిలో ఉన్నారట. మరి కాంతార చాప్టర్ 1 నుంచి ఎదురవుతున్న సవాళ్ళను ఎలా దాటుకుంటుందో వేచి చూడాలి.
This post was last modified on September 26, 2025 3:53 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…