ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతున్న ట్రెండ్ ఏంటంటే ఒక ఇమేజ్ ఉన్న హీరోతో సినిమా తీస్తున్నప్పుడే పార్ట్ 2కి ఛాన్స్ ఉండేలా క్లైమాక్స్ లో ట్విస్టు పెట్టేయడం. బొమ్మ బాగా ఆడితే క్రేజ్ ఉంది కదాని బాహుబలి, పుష్ప లాగా సీక్వెల్స్ కి వెళ్లిపోవచ్చు. లేదు ఏమైనా తేడా కొడితే అక్కడితో ఆగిపోవచ్చు. ప్రేక్షకులు మరిచిపోతారు. సమంత యశోద, కళ్యాణ్ రామ్ డెవిల్, చిరంజీవి గాడ్ ఫాదర్, విజయ్ దేవరకొండ కింగ్డమ్ ఈ కోవలోకే వస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు ఉంది. వీటికి కొనసాగింపులు ఉండవనేది ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు ఓజి వంతు వచ్చింది. ఒకవేళ యావరేజ్ అయ్యుంటే డిస్కషన్ అవసరం పడేది కాదు.
కానీ సూపర్ హిట్ నుంచి బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేస్తున్న ఓజికి కంటిన్యుయేషన్ ఖచ్చితంగా ఉండబోతోంది. దర్శకుడు సుజిత్ పలు ఇంటర్వ్యూలలో ఇదే చెబుతున్నాడు. ఇప్పుడొచ్చిన ఓజితో కలిపి మొత్తం మూడు భాగాలు తీసే ప్లానింగ్ ఉందట. ప్రస్తుతం జ్వరంతో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ మనసులో ఏముందో బయటికి వస్తే తప్ప ఓజి 2 ఎప్పుడనేది క్లారిటీ ఉండదు. ఇన్ సైడ్ టాక్ అయితే త్రివిక్రమ్, డివివి దానయ్య ద్వారా రెస్పాన్స్ తెలుసుకున్న పవన్ కళ్యాణ్ రెండో భాగం చేద్దామనే దిశగా సంకేతం ఇచ్చారట. కాకపోతే వెంటనే సాధ్యం కాకపోవచ్చు. ఎందుకో చూద్దాం.
సుజిత్ ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నానికి ఒక కమిట్ మెంట్ ఇచ్చాడు. బ్లడీ రోమియో అనే టైటిల్ ఆల్రెడీ ప్రచారంలో ఉంది. ది ప్యారడైజ్ పూర్తి కావడానికి ఇంకో అయిదు నెలల టైం ఉంది కాబట్టి ఈలోగా స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో సుజిత్ బిజీ అవుతాడు. ఒకవేళ పవన్ కనక ఓజి 2 వేగంగా తీసేద్దాం అంటే నానిని రిక్వెస్ట్ చేసుకుని కొంత బ్రేక్ తీసుకుని ఇటు వచ్చేయొచ్చు. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేశాక పవన్ కు సినిమాల పరంగా ఒత్తిడి లేదు. ఇంకో రెండు మూడు సినిమాలు చేయాలని నిర్ణయించుకుంటే దాంట్లో ముందుగా ఓజి 2నే ఉంటుందని పవన్ దగ్గరి వర్గాల మాట. కానీ రాజకీయ మరియు ప్రభుత్వ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న పవన్ సినిమాలపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
This post was last modified on September 26, 2025 11:41 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…