సరిగ్గా ఇంకో వారం రోజుల్లో కాంతారా చాప్టర్ 1 ది లెజెండ్ విడుదల కానుంది. ప్రమోషన్ల పరంగా ఇప్పటిదాకా ట్రైలర్ రిలీజ్ చేయడం, కన్నడలో రెండు మూడు ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప హోంబాలే ఫిలిమ్స్ సైలెంట్ గా ఉంది. హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి టీమ్ ని వెంటేసుకుని బెంగళూరు ఉంచి ప్రెస్ మీట్లు మొదలుపెట్టి త్వరలో హైదరాబాద్ రానున్నాడు. ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ ఓజికి వచ్చిన బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ కాంతార టీమ్ కు ఎంతైనా టెన్షన్ కలిగించేదే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్వాగ్ ఎంజాయ్ చేస్తున్న అభిమానులు ఇప్పుడప్పుడే శాంతించేలా లేరు. టికెట్ రేట్లు ఎంత ప్రియంగా ఉన్నా రిపీట్ రన్స్ చూస్తూ కలెక్షన్ల వర్షంలో భాగమవుతున్నారు.
కాంతార వచ్చే సమయానికే ఓజి రెండో వారంలో అడుగు పెడుతుంది. సరిగ్గా పండగ టైం కావడంతో ఇప్పుడున్న ట్రెండ్ అక్కడిదాకా కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాంతారకు డిస్ట్రిబ్యూషన్ పరంగా మైత్రి అండదండలు ఉన్నా పవన్ మేనియా నుంచి కాంతారకు డైవర్ట్ చేయించడం అంత సులభం కాదు. పైగా పెంచిన ఓజి టికెట్ రేట్లు తగ్గింపుకొచ్చే సమయానికి కాంతారా వస్తుంది. అంటే సెకండ్ వీక్ లో ఉన్నా సరే ఓజాస్ గంభీర నుంచి కాంతారకు సవాల్ తప్పకపోవచ్చు. మూడు నిమిషాల ట్రైలర్ కు ఆన్ లైన్లో కొంత మిశ్రమ స్పందన రావడాన్ని టీమ్ సీరియస్ గా విశ్లేషించుకునే పనిలో ఉంది.
మాములుగా పవన్ మూవీకి యావరేజ్ లేదా హిట్ టాక్ వస్తేనే నిలువరించడం కష్టం. అలాంటిది ఇంత పెద్ద స్పందన దక్కించుకోవడం చూసి అభిమానులకు ఆనంద బాష్పాలు వస్తున్నాయి. సుజిత్ కూడా బయటికి వచ్చేసి ఎవరికీ తెలియని చాలా విషయాలు పంచుకుంటున్నాడు. ఓజాస్ గంభీర గతం మీద ఒక నవల విడుదల చేస్తా అంటున్నాడు. ఓజి ఊపు చూస్తుంటే సంక్రాంతికి వస్తున్నాం రేంజ్ లో కనీసం పది రోజులు స్ట్రాంగ్ గా ఉండేలా కనిపిస్తోంది. అదే జరిగితే కాంతారకు ఓపెనింగ్ రావొచ్చేమో కానీ కాంపిటీషన్ అయితే టఫ్ గా ఉంటుంది. చూడాలి మరి పోటీ ఎంత రసవత్తరంగా ఉంటుందో.
This post was last modified on September 26, 2025 3:10 pm
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…