ఈ మధ్య కాలంలో భారీ అంచనాలున్న ప్యాన్ ఇండియా సినిమాల ఎడిటింగ్ లో అడ్డం వస్తోందని అనిపిస్తే చాలు కోట్లు ఖర్చు పెట్టి తీసినా పాటైనా సరే మొహమాటం లేకుండా డిలీట్ కొడుతున్నారు. ఇటీవలే మిరాయ్ లో వైబ్ ఉందిలే సాంగ్ ని ఫస్ట్ రిలీజ్ లో పెట్టలేదు. దాంతో ఫ్యాన్స్ షాక్ తిన్నారు. ఫ్లోకు అడ్డం వచ్చిందని హీరో తేజ సజ్జ, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని చెప్పిన మాటలు నిజమే అయినా ఇది లేకపోవడం కొంత అసంతృప్తిని కలిగించింది. పది రోజుల తర్వాత ఫ్రెష్ గా దాన్ని జోడించడం వేరే విషయం. గతంలో దేవర, కింగ్డమ్ లకు ఇదే సమస్య వచ్చిన సంగతి తెలిసిందే.
ఇప్పుడీ లిస్టులో ఓజి కూడా చేరింది. తమన్ కంపోజింగ్ చేసిన పాటకు నేహా శెట్టి డాన్స్ చేసింది. బ్యాంకాక్ లో షూట్ చేశారు. కానీ స్క్రీన్ మీద రాలేదు. ఇక్కడ కూడా ఫ్లోనే సమస్య. నెరేషన్ సీరియస్ గా సాగుతుంది. ఎక్కడా ఎంటర్ టైన్మెంట్ ఉండదు. ఎలివేషన్లతో ఫ్యాన్స్ ఊగిపోతూ ఉంటే ఇక కామెడీకి స్కోప్ ఎక్కడిది. అదే విధంగా ఐటెం సాంగ్ పెట్టే అవకాశం కూడా కనిపించలేదు. పైగా ప్రియాంక మోహన్ తో అంత ఎమోషనల్ ఎపిసోడ్ పెట్టాక నేహాతో ఆటా పాట అంటే బాగుండదని అనుకున్నారేమో. ఇన్ సైడ్ టాక్ అయితే రాబోయే సోమవారం నుంచి యాడ్ చేస్తారట. దీని లిరికల్ వీడియో అయితే వదల్లేదు.
ఏది ఏమైనా ఇకపై నిర్మాతలు ఒకటికి రెండుసార్లు స్క్రిప్ట్ దశలోనే ఫలానా పాటలు అవసరమా లేదా అని దర్శకుల దగ్గర క్లారిటీ తీసుకోవాలి. ఒకవేళ వద్దు అనుకుంటే బోలెడు డబ్బు ఆదా అవుతుంది. దాన్ని ఇతర అవసరాల కోసం వాడుకోవచ్చు. ఎందుకంటే ఒక సినిమా రిలీజై వారం పది రోజులు రన్ పూర్తి చేసుకున్నాక ఆటోమేటిక్ గా దాన్ని లైఫ్ తగ్గిపోతుంది. హఠాత్తుగా డిలీట్ చేసిన పాట పెట్టినంత మాత్రం కలెక్షన్లు అమాంతం పెరిగిపోవు. ఓజిలో నేహా శెట్టిని చూడాలంటే ఎన్ని రోజులు ఆగాలో మరి. దీనికి సంబంధించిన అప్డేట్ వీకెండ్ లోపు రావొచ్చని అంతర్గత వర్గాల సమాచారం.
This post was last modified on September 25, 2025 1:23 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…