తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు టాప్ హీరోయిన్‍గా ఎదిగిన పూజ హెగ్డేకి ఇంకా హై డిమాండ్ వుంది. ఆమె అడిగినంత పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు సై అంటున్నారు. ఆమె డేట్స్ ఇస్తే చాలు, రెమ్యూనరేషన్ ఎంతయినా ఫర్లేదని అడ్జస్ట్ అవుతున్నారు. అయితే ఇంత డిమాండ్ వున్నా కానీ పూజ హెగ్డే కొన్నాళ్ల పాటు తెలుగు వాళ్లకు అందుబాటులో వుండదు. ఎందుకంటే ఆమె ఇప్పుడు సల్మాన్‍ఖాన్‍తో ఒకటి, రణ్‍వీర్ సింగ్‍తో ఒకటి చొప్పున సినిమా చేస్తూ బాలీవుడ్‍లో యమ బిజీగా వుంది. బాలీవుడ్ వర్సెస్ తెలుగు సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ముందుగా హిందీ చిత్ర సీమనే కోరుకుంటుంది.
అందులోను అంత పెద్ద స్టార్స్తో సినిమాలంటే పూజ వాటిని వదులుకునేంత తెలివిలేనిది కాదు. రాధే శ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‍లర్ తర్వాత పూజ హెగ్డే ఇక తెలుగు సినిమాల్లో ఇప్పట్లో కనిపించే వీల్లేదు. ఎందుకంటే హిందీ చిత్ర సీమలో ఇప్పుడు హాట్ హీరోయిన్లు చాలా తక్కువైపోయారు. సల్మాన్, రణ్‍వీర్ సినిమాల తర్వాత పూజ కోసం మరింత మంది బాలీవుడ్ నిర్మాతలు క్యూ కడతారు. ఇప్పుడు తెలుగు చిత్ర నిర్మాతలు తనకు అయిదు కోట్లు ఇచ్చినా కానీ పూజ హెగ్డే ఆ ఆఫర్‍ని కాదనవచ్చు.
This post was last modified on November 26, 2020 10:39 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…