పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక అంచనాలతో రిలీజవుతున్న సినిమా.. ఓజీ. మూడేళ్ల ముందు మొదలైన ఈ సినిమా.. పవన్ పొలిటికల్, సినీ కమిట్మెంట్ల వల్ల ఆలస్యమై.. ఎట్టకేలకు కొన్ని నెలల ముందే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ముందు రోజు రాత్రి నుంచే తెలుగు రాష్ట్రాల్లో ప్రిమియర్స్ కూడా పడబోతున్నాయి. పవన్ చివరి చిత్రం ‘హరిహర వీరమల్లు’ తీవ్రంగా నిరాశపరచడంతో ఈ చిత్రంపై అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు.
‘వీరమల్లు’లా ఈ చిత్రానికి బడ్జెట్, బిజినెస్ పరంగా సమస్యలు రాలేదు. ‘వీరమల్లు’కు పవన్ తన పారితోషకం కూడా పూర్తిగా అందుకోలేని పరిస్థితి తలెత్తింది. రిలీజ్ తర్వాత లాభాలు వస్తే చూద్దాం అనుకున్న పవన్.. అందుకు అవకాశం లేక ఊరుకున్నాడు. ఐతే ‘ఓజీ’కి మాత్రం ఏ రకమైన ఇబ్బందీ లేదు. అనుకున్న దాని కంటే బడ్జెట్ పెరిగినప్పటికీ.. బిజినెస్ భారీగా జరగడంతో నిర్మాత మంచి లాభాలే అందుకున్నాడు. దీంతో పవన్‌కు ఆయన స్టార్ పవర్‌కు తగ్గట్లే పారితోషకం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు పవన్ రూ.70 కోట్ల మేర రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. ముందు అనుకున్న మొత్తం కంటే ఇది కొంచెం ఎక్కువే అని తెలుస్తోంది. సినిమాకు రూ.200 కోట్లకు పైగానే బడ్జెట్ అయినట్లు సమాచారం. ఇందులో మేకింగ్ కోసం పెట్టిన ఖర్చు సగమే. కానీ పారితోషకాలు, సినిమా మేకింగ్ ఆలస్యం కావడం వల్ల పడ్డ వడ్డీల భారమే ఎక్కువైంది. అయినా సరే ‘ఓజీ’కి ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన డిమాండ్ రావడంతో నిర్మాతకు మంచి లాభాలే అందాయి.
సినిమా బిజినెస్ రూ.300 కోట్ల మార్కును టచ్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో డిజిటల్ హక్కులే రూ.100 కోట్లను మించిపోయాయి. బయ్యర్లు సినిమాపై భారీ పెట్టుబడులే పెట్టినప్పటికీ.. బ్రేక్ ఈవెన్ కష్టంగా ఏమీ అనిపించడం లేదు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మంచి లాభాలు కూడా అందుకోవచ్చు.
This post was last modified on September 24, 2025 11:52 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…