Movie News

కాంతార చూడాలంటే నాన్ వెజ్ తినకూడదా?

ఈ ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘కాంతార: చాప్టర్-1’ ఒకటి. మూడేళ్ల ముందు చిన్న సినిమాగా మొదలై.. పాన్ ఇండియా స్థాయిలో ఎవ్వరూ ఊహించని అసాధారణ విజయాన్ని అందుకుంది ‘కాంతార’. దానికి ప్రీక్వెల్‌గా తెరకెక్కిన ‘కాంతార: చాప్టర్-1’పై భారీ అంచనాలే ఉన్నాయి. సైలెంట్‌గా మేకింగ్ పూర్తి చేసిన చిత్ర బృందం.. ఇటీవలే ట్రైలర్ లాంచ్ చేసింది. అది ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. రిలీజ్ వీక్‌లో ప్రమోషన్లు కొంచెం గట్టిగా చేయాలని టీం భావిస్తోంది. 

ఈ లోపు ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ సోషల్ మీడియాలో కలకలం రేపింది. ఆధ్యాత్మిక, దైవ సంబంధిత అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా చూడాలంటే రాబోయే వారం రోజుల పాటు మందు, సిగరెట్ ముట్టుకోకూడదని.. అలాగే మాంసాహారం కూడా మానేయాలని ‘కాంతార’ టీం పిలుపు ఇచ్చినట్లుగా ఉంది ఆ పోస్టర్. ఈ మేరకు గూగుల్ ఫామ్ కూడా ఫిల్ చేయాలని అభిమానులను టీం కోరినట్లుగా అందులో ఉంది.

ఈ పోస్టర్ వైరల్ కావడంతో ఇదేం పబ్లిసిటీ, ఇవేం కండిషన్లు అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోయారు. సినిమా చూడాలంటే నాన్ వెజ్, మందు మానేయాలా అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ విషయం ‘కాంతార’ టీం వరకు వెళ్లింది. దీనిపై హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి స్పందించాడు. ఈ పోస్టర్‌కు, టీంకు సంబంధం లేదని.. తాము అలాంటి కండిషన్లేమీ ప్రేక్షకులకు పెట్టలేదని అతను స్పష్టం చేశాడు. ఎవరో కావాలనే ఈ పోస్టర్ క్రియేట్ చేశారని అతనన్నాడు. ఐతే ఈ లోపే ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. 

రిషబ్ శెట్టి సరసన రుక్మిణి వసంత్ నటించిన ‘కాంతార: చాప్టర్-1’లో బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య విలన్ పాత్ర పోషించాడు. హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 2న రిలీజ్ కానుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఈజీగా 500 కోట్ల వసూళ్లు వస్తాయని ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు.

This post was last modified on September 24, 2025 7:57 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

52 minutes ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

55 minutes ago

నందమూరి ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం

‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…

59 minutes ago

అమెరికా కొంటే తప్పులేదు.. భారత్ కొంటే తప్పా?

ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…

1 hour ago

ఇండిగో దెబ్బకు డీజీసీఏ యూ టర్న్!

ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులు గందరగోళంగా మారడంతో కేంద్రం దిగివచ్చింది. ప్రయాణికుల కష్టాలు చూడలేకనో, లేక ఇండిగో లాబీయింగ్‌కు…

1 hour ago

మా ఆవిణ్ణి గెలిపిస్తే.. ఫ్రీ షేవింగ్‌: ‘పంచాయ‌తీ’ హామీ

ఎన్నిక‌లు ఏవైనా.. ప్ర‌జ‌ల‌కు 'ఫ్రీ బీస్‌' ఉండాల్సిందే. అవి స్థానిక‌మా.. అసెంబ్లీనా, పార్ల‌మెంటా? అనే విష‌యంతో సంబంధం లేకుండా పోయింది.…

1 hour ago