పవన్ కళ్యాణ్ అభిమానులు రేపు రాత్రి ఓజి ప్రీమియర్ కు ఎంతైతే ఎగ్జైట్ అవుతున్నారో అంతకన్నా ఎక్కువ టెన్షన్ ఓవర్సీస్ షోల గురించి పడుతున్నారు. ఎందుకంటే కంటెంట్, డ్రైవ్స్ ని డిస్పాచ్ చేయడంలో జరిగిన ఆలస్యం వల్ల నూటా ఎనభైకి పైగా లొకేషన్లలో షోలు తీసేశారనే టాక్ దావానలంలా మారింది. అక్కడి డిస్ట్రిబ్యూటర్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నప్పటికీ ఫైనల్ గా కంటెంట్ మొత్తం చేరిందని చెప్పడం లేదు. భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రికి ఈ లాంఛనం పూర్తవుతుందనేది ఇన్ సైడ్ టాక్. కొన్ని రీల్స్ మీద తమన్ రీ వర్క్ చేస్తున్నారనే టాక్ అంతర్గతంగా వినిపిస్తోంది.
ఫారిన్ లో అలా ఉంటే ఇండియాలో సీన్ ఇంకోలా ఉంది. 24 రాత్రి ప్రీమియర్ షోల టికెట్ల కోసం జరుగుతున్న పైరవీలు మాములుగా లేవు. హైదరాబాద్ లోని మంచి సింగల్ స్క్రీన్లలో అనధికార టికెట్ ధర మూడు నుంచి అయిదు వేల రూపాయల మధ్యలో ఉందట. అయినా సరే అంత సులభంగా దొరకడం లేదని సమాచారం. ఏపీ తెలంగాణలో మూలనబడిన పాత థియేటర్లలో సైతం వెయ్యి రూపాయల టికెట్లు సోల్డ్ అవుట్ పడుతున్నాయంటే ఓజి క్రేజ్ మాటల్లో చెప్పేందుకు సాధ్యం కావడం లేదు.
ఇప్పటికే యాభై కోట్ల గ్రాస్ దాటేసిన ఓజి ఫస్ట్ డే పాత రికార్డులన్నీ తుడిచిపెట్టేలా ఉంది. కాకపోతే వరల్డ్ వైడ్ ఓపెనింగ్ కి మాత్రం దెబ్బ పడొచ్చు. ఇప్పుడు రద్దు చేసిన షోలు పునరుద్ధరించి తిరిగి టికెట్లు అమ్మేలోపు పుణ్యకాలం వచ్చేస్తుంది. పైగా ఒక కీలక పంపిణీదారు తప్పుకోవడంతో కొంచెం ఇబ్బందులు తలెత్తుతున్నాయని వినికిడి. ఒకవేళ సరైన ప్లానింగ్ తో కంటెంట్ ని ముందుగానే సిద్ధం చేసుకుని ఉంటే 3 నుంచి 4 మిలియన్ల దాకా మొదటి రోజు నెంబర్ నమోదయ్యేదని ఎన్ఆర్ఐ ఫ్యాన్స్ వాపోతున్నారు. సరే ఎవరినని ఏం లాభమనే తరహాలో రేపు రాత్రి షో అయిపోయే దాకా ఈ డిస్కషన్లు చర్చలు తప్పవు.
This post was last modified on September 23, 2025 5:57 pm
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఇండియాలో వివిధ భాషల్లో అనేక టాక్ షోలు ఉన్నాయి. అందులో అత్యంత పాపులర్ ఏది అంటే బాలీవుడ్ దర్శక నిర్మాత…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…