ఎఫ్ 2 చిత్రాన్ని సైన్ చేసినప్పటికే వరుణ్ తేజ్‍కి కొన్ని హిట్లున్నాయి కానీ అప్పుడు వెంకటేష్‍తో కలిసి నటించడానికి వరుణ్ తేజ్ పెద్దగా ఆంక్షలేమీ పెట్టలేదు. దిల్ రాజు ఇస్తానని చెప్పినంత పారితోషికమే తీసుకున్నాడు. పాత్ర పరంగా ఎలాంటి డిమాండ్లు కూడా చేయలేదు. కానీ ఇప్పుడా సినిమా సీక్వెల్‍కి మాత్రం వరుణ్ తేజ్ తగ్గేది లేదంటున్నాడట. ఈసారి తన పారితోషికం భారీగా పెంచేసి అడుగుతున్నాడట. అలాగే పాత్ర పరంగా తనకు సమాన ప్రాధాన్యం వుండాలని చెప్పాడట.
వరుణ్ తేజ్ ఇప్పుడిలా పట్టుబట్టడంతో దిల్ రాజు దీనిని ఎలా తెగ్గొట్టాలా అని చూస్తున్నాడట. ఎఫ్ 2 చిత్రానికి దిల్ రాజుకి ముప్పయ్ కోట్లకు పైగా లాభాలు వచ్చాయి. సీక్వెల్ అంటే తప్పకుండా క్రేజ్ భారీ స్థాయిలో వుంటుంది కనుక ఈసారి వరుణ్ అయినా, వెంకటేష్ అయినా తక్కువకు సర్దుకుపోయే అవకాశం లేదు. అలాగే అనిల్ రావిపూడికి కూడా మునుపటి కంటే అధిక పారితోషికం ఇవ్వక తప్పదు.
అప్పుడు ముప్పయ్ కోట్ల లోపు బడ్జెట్‍లో రూపొందిన ఎఫ్ 2కి ఈసారి కనీసం యాభై నుంచి అరవై కోట్లు ఖర్చు పెట్టక తప్పదంటున్నారు. కరోనా సాకు చూపించి బడ్జెట్ పరంగా కోతలు విధించాలని చూస్తోన్న దిల్ రాజుకి ఈ చిత్రం విషయంలో ఆ రాయితీలు వచ్చేట్టు లేవు.
This post was last modified on November 26, 2020 1:28 am
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…