బిచ్చగాడు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన మార్కెట్ ని నిలబెట్టుకోలేకపోయిన విజయ్ ఆంటోనీ తర్వాత ఎన్ని సినిమాలు నటించారో, వాటిలో ఎన్ని జనాలకు గుర్తున్నాయో చెప్పడం చాలా కష్టం. బిచ్చగాడు 2 కమర్షియల్ గా కొంత ఓకే అనిపించుకున్నప్పటికీ మిగిలినవి కనీసం సోదిలో కూడా లేనంత దారుణంగా ఫెయిలయ్యాయి. ముఖ్యంగా తెలుగులో కనీస ఓపెనింగ్స్ తెచ్చుకునే స్థాయి నుంచి మార్నింగ్ షోలే క్యాన్సిలయ్యే దాకా తన మార్కెట్ టాలీవుడ్ లో బాగా డౌన్ అయిపోయింది. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిలా రెండు మూడు నెలలకోసారి ఆడియన్స్ ని పలకరిస్తూనే ఉంటాడు. అలా వచ్చిందే భద్రకాళి.
మొన్న శుక్రవారం విడుదలైన ఈ పొలిటికల్ డ్రామా అసలు వచ్చిన సంగతే సగటు ఆడియన్స్ కి గుర్తు లేనంత వీక్ గా ప్రమోషన్స్ జరిగాయి. హైదరాబాద్ వచ్చి విజయ్ ఆంటోనీ ఓ ఈవెంట్, కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాడు కానీ అవి జనాన్ని చేరలేదు. అయినా సరే ట్రైలర్ కొంచెం ఆసక్తికరంగా అనిపించడంతో అంతో ఇంతో మూవీ లవర్స్ దీని మీద ఒక లుక్ వేద్దామనుకున్నారు. సెక్రేటేరియట్ లో బ్రోకర్ గా పని చేసే ఒక వ్యక్తికి, అధికారం పదవి కోసం ఎంత దూరమైనా వెళ్లే ఒక రాజ్యాంగ శక్తికి మధ్య జరిగే యుద్ధంగా దర్శకుడు అరుణ్ ప్రభు దీన్ని రూపొందించారు. ఈయన డెబ్యూ మూవీ అరువి క్లాసిక్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
శంకర్ తరహాలో సీరియస్ పొలిటికల్ డ్రామాని ఇంటెన్స్ రివెంజ్ తో మిక్స్ చేయాలని చూసిన అరుణ్ ప్రభు ఈ ప్రయత్నంలో సఫలీకృతం కాలేకపోయారు. ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఏదోలా నెట్టుకొచ్చినప్పటికీ కీలకమైన సెకండాఫ్ లో చేతులు ఎత్తేయడంతో భద్రకాళి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. జీరో అంచనాలు పెట్టుకుంటే తప్ప దీన్ని భరించడం కష్టమనేలా నేరేషన్ ఉండటం ప్రధాన మైనస్. విజయ్ ఆంటోనీ తనవరకు ఓకే అనిపించాడు కానీ అసలైన కంటెంట్ లో డెప్త్, ఎమోషన్, ఎంగేజ్ చేసే మెటీరియల్ లేకపోవడంతో జనాన్ని రప్పించడం కష్టమే. కథకు టైటిల్ కు సంబంధమే లేకపోవడం అసలు ట్విస్ట్.
This post was last modified on September 20, 2025 10:18 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…