అభిమానులు ప్రేమతో లాలెట్టాన్ అని పిలుచుకునే కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడం మూవీ లవర్స్ ని సంతోషంలో ముంచెత్తుతోంది. మలయాళ పరిశ్రమకు చెందిన హీరో అయినప్పటికీ డబ్బింగ్ సినిమాల ద్వారా మనకూ ఎంతో సుపరిచితుడైన మోహన్ లాల్ ని ఈ పురస్కారం ఎప్పుడో వరించాల్సింది. ఎందుకంటే అన్ని అర్హతలు ఆయనకు ఉన్నాయి కాబట్టి. నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన ప్రయాణంలో ఈ విలక్షణ నటుడి కెరీర్ మీద ఒక్కసారి లుక్ వేస్తే ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అంత ట్రాక్ రికార్డు సొంతం చేసుకున్నారు.
చాలా పరిమితమైన మార్కెట్ ఉండే మల్లువుడ్ కి మోహన్ లాల్ 1978లో వచ్చారు. అప్పటికి ఆ పరిశ్రమ మీద ఎక్కువ అశ్లీల చిత్రాలు తీస్తారనే ముద్ర ఉండేది. తొలినాళ్ళలో విలన్ వేషాలే దక్కాయి. 1980లో మంజిల్ విరింజ పూక్కల్ తో తొలి బ్రేక్ అందుకున్న మోహన్ లాల్ అక్కడి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. ఒకపక్క కమర్షియల్ మార్కెట్ పెంచుకుంటూనే మరోపక్క ప్రయోగాలు చేయడానికి వెనుకాడని తత్వం ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచింది. గ్యాంగ్ స్టర్ డ్రామాలు, మాస్ మాసాలాలతో పాటు వానప్రస్తం లాంటి అవార్డు విన్నింగ్ మూవీస్ తో ఏకాకాలంలో మెప్పించడం మోహన్ లాల్ కే చెల్లింది.
2001లో పద్మశ్రీ, 2019లో పద్మభూషణ్ అందుకున్న మోహన్ లాల్ అయిదు సార్లు ఉత్తమ నటుడిగా, ఒకసారి నిర్మాతగా జాతీయ అవార్డు అందుకోవడం ఈయనకే చెల్లింది. అరవై అయిదేళ్ల వయసులో కూడా ఏడాదికి మూడు సినిమాలు చేస్తున్న మోహన్ లాల్ ఇప్పటిదాకా నాలుగు వందల పైచిలుకు చిత్రాల్లో విభిన్నమైన విలక్షణమైన పాత్రలు లెక్కలేనన్ని చేశారు. తెలుగులో జనతా గ్యారేజ్, మనమంతా, కన్నప్పలో నటించిన మోహన్ లాల్ గాండీవంలో ఏఎన్ఆర్ పక్కన స్టెప్పులు వేయడం కోసం ఒక పాట చేయడం ఒక విశేషం. ఇప్పటికీ నిత్య యవ్వనంతో ఉరకలు వేసే మోహన్ లాల్ త్వరలో వృషభతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు.
This post was last modified on September 20, 2025 10:15 pm
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…