కళ్యాణి ప్రియదర్శన్ మలయాళంలో స్టార్ ఇమేజ్ ఉన్న కథానాయికేమీ కాదు. ఆమెను అప్ కమింగ్ హీరోయిన్‌గానే భావించాలి. ఆమెను లీడ్ రోల్‌లో పెట్టి రూ.30 కోట్ల బడ్జెట్లో సినిమా తీయడమంటే సాహసం అనే చెప్పాలి. కానీ దుల్కర్ సల్మాన్ మాత్రం ధైర్యం చేశాడు. డొమినిక్ అరున్ అనే దర్శకుడి కథను నమ్మి ‘లోక’ సినిమాను పెద్ద బడ్జెట్లో నిర్మించాడు.
ఈ సినిమా పట్ల బయ్యర్లలో పెద్దగా ఆసక్తి కనిపించకపోవడంతో నష్టాలు తప్పవని అతను ఫిక్సయిపోయాడట. కానీ రిలీజ్ ముంగిట అనూహ్యమైన క్రేజ్ తెచ్చుకున్న ‘లోక’ మలయాళంలోనే కాక వేరే భాషల్లోనూ అద్భుతమైన స్పందన తెచ్చుకుని బ్లాక్ బస్టర్ అయింది. బాక్సాఫీస్ దగ్గర ఒక్కో మైలరాయిని దాటుకుంటూ వెళ్తున్న ‘లోకా’ ఇప్పుడు అసాధారణమైన రికార్డు ముంగిట నిలిచింది. ఈ సినిమా మలయాళ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ ఏడాదే మోహన్ లాల్ సినిమా ‘ఎల్2: ఎంపురాన్’ రూ.268 కోట్లతో ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. రెండో స్థానంలో కూడా లాల్ సినిమా ‘తుడురమ్’యే ఉండడం విశేషం. ఆ చిత్రం రూ.242 కోట్లు వసూలు చేసింది. ‘లోక’ ఆల్రెడీ ఆ రికార్డును దాటేసింది. ప్రస్తుతం ఈ సినిమా వసూళ్లు రూ.260 కోట్లకు చేరుకున్నాయి. ఇంకో ఏడెనిమిది కోట్లు వసూలు చేస్తే ‘లోక’నే నంబర్ వన్ అవుతుంది. ఐతే ‘లోక’ రిలీజై మూడు వారాలు దాటిపోయింది.
ప్రస్తుతం ఆ సినిమాకు ఓ మోస్తరు వసూళ్లు వస్తున్నాయి. ఈ వీకెండ్ అయ్యేసరికి కొంచెం కష్టపడి అయినా ‘లోక’.. ‘ఎంపురాన్’ వసూళ్లను దాటేస్తుందని భావిస్తున్నారు. మొత్తానికి థియేట్రికల్ రన్ అయ్యేసరికి ‘లోక’ ఈ అద్భుత రికార్డును అందుకోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ఒక అప్‌కమింగ్ హీరోయిన్ని పెట్టి తీసిన లేడీ ఓరియెంటెడ్ సినిమా.. మోహన్ లాల్ పేరిట ఉన్న ఇండస్ట్రీ హిట్ రికార్డును దాటడం అంటే చిన్న విషయం కాదు.
This post was last modified on September 19, 2025 9:30 pm
బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్‌సభను కుదిపేసింది.…
రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…