చిన్న సినిమాల్లో పెద్ద సెన్సేషన్ గా నిలిచిన లిటిల్ హార్ట్స్ కేవలం వారం గ్యాప్ లో మిరాయ్ లాంటి ఫాంటసీ బ్లాక్ బస్టర్ వచ్చినా సరే వెనక్కు తగ్గే ఆలోచన చేయకుండా ప్రమోషన్ల వేగం ఇంకా పెంచింది. కేవలం రెండు మూడు రోజుల వ్యవధిలో వరస సక్సెస్ మీట్లు పెడుతూ పదే పదే మీడియాతో, అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యేందుకు ఉరకలు వేస్తోంది. నిన్న విజయ్ దేవరకొండ, అల్లు అరవింద్ అతిథులుగా పెద్ద హంగామానే చేశారు. బండ్ల గణేష్ స్పీచ్ ఆశించినట్టే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మౌళికి ఆయన చేసిన హితబోధని హీరోల అభిమానులు పోటీపడి మరీ షేర్ చేసుకుంటున్నారు.
దీనికి జస్ట్ కొద్దిరోజుల ముందే అడివి శేష్ గెస్టుగా ఇంకో ఈవెంట్ చేయడం ఇంకా మైండ్ లో ఫ్రెష్ గానే ఉంది. అంతకు ముందు మరో వేడుక చేశారు. ప్రెస్ మీట్లు నిర్వహించారు. కేక్ కటింగులు చేసి ఆ వీడియోలు ఛానల్స్ కు పంపించారు. రిలీజ్ కు ముందు వరకు పెద్దగా సౌండ్ చేయని దర్శకుడు సాయి మార్తాండ్, మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ ఎర్రమల్లి పోటీ పడి మరీ ఇంటర్వ్యూలు ఇచ్చారు. వాటిలో కొన్ని వైరలయ్యాయి. మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూ క్లిప్ ఏకంగా మహేష్ బాబు దాకా వెళ్ళింది. ఇలా నిత్యం జనం నోళ్ళలో నానుతూ ఉండేలా లిటిల్ హార్ట్స్ చేసిన పబ్లిసిటీ భారీగా వర్కౌట్ అయ్యింది.
ఇప్పుడు ఈ సినిమా టీమ్ చేతిలో ఉన్నది కేవలం వారం రోజులు మాత్రమే. ఓజి వచ్చాక దీనికి ఫైనల్ రన్ తప్పదు. ఎలాగూ ఓటిటి విండోని నాలుగు వారాలకే అనుకున్నారు కాబట్టి ఇది సరిపోతుంది. అనుకున్న దానికన్నా మూడు నాలుగింతలు ఎక్కువ వసూళ్లు వచ్చాయి. సూపర్ హిట్ నుంచి బ్లాక్ బస్టర్ స్టేటస్ అందుకుంది. ఇంతకన్నా టీమ్ కు కావాల్సింది ఏముంటుంది. కంటెంట్ ఎంత బాగున్నా సరైన రీతిలో ప్రమోషన్లు చేసుకుంటే సినిమా ఇంకా ఎంత ఎత్తుకు తీసుకెళ్లొచ్చనే దాని మీద లిటిల్ హార్ట్స్ ఒక రోల్ మోడల్ లా నిలుస్తోంది. ఇలాంటి ప్లానింగ్ లేకపోతే మూవీ ఎంత బాగున్నా ఓపెనింగ్స్ రావడం కూడా కష్టమే.
This post was last modified on September 19, 2025 10:39 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…