ఓటిటిల కండీషన్లలకు తలొగ్గి పెద్ద పెద్ద ప్యాన్ ఇండియా సినిమాలే 28 రోజుల విండోకు జై కొడుతున్న రోజులివి. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా డిజాస్టర్ అయినా ఒకటే ట్రీట్ మెంట్, ఒకటే లెక్క అన్నట్టు మారిపోయింది. హరిహర వీరమల్లు, కింగ్డమ్, కూలీ అన్నింటిదీ ఇదే కథ. కానీ అసలెలాంటి హైప్ లేకుండా వచ్చిన యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహ అంచనాలకు అందని రీతిలో ఘనవిజయం సాధించి ఏకంగా 300 కోట్లకు పైగా వసూళ్లతో ట్రేడ్ పండితుల మతులు పోగొట్టడం చూస్తూనే ఉన్నాం. 56 రోజులు దాటుతున్నా సరే ఇంకా మెయిన్ సెంటర్స్ లో ఈ మూవీ ఆడుతూనే ఉండటం గమనించాల్సిన విషయం .
థియేటర్ రన్ పూర్తి చేసుకోబోతున్న తరుణంలో మహావతార్ నరసింహ నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. పెద్దగా హడావిడి చేయకుండా హఠాత్తుగా సెప్టెంబర్ 19 రిలీజ్ అంటూ కేవలం కొన్ని గంటల ముందు ప్రకటన ఇవ్వడం మూవీస్ లవర్స్ ని ఆశ్చర్యపరిచింది. నిజానికి రెండు నెలల క్రితం రిలీజ్ కు ముందు ఈ చిత్రానికి డిజిటల్ డీల్ జరగలేదు. ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూశాక ఓటిటిలు విపరీతంగా పోటీ పడ్డాయి. ఈ రేసులో నెట్ ఫ్లిక్స్ కప్పు గెలుచుకుంది. సౌత్ ఇండియన్ కంటెంట్ మీద పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్న ఈ సంస్థకు మహావతార్ నరసింహ బంగారు బాతులా మారనుందని ఒక అంచనా.
ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ కు రావడంలో హోంబాలే ఫిలిమ్స్ కీలకంగా వ్యవహరించినట్టు ఇన్ సైడ్ టాక్. ఈ సంస్థ నిర్మాణంలో వచ్చిన సలార్, బఘీరా లాంటివి ఈ కాంబోలోనే డీల్స్ జరుపుకున్నాయి. మహావతార్ నరసింహకు ప్రెజెంటర్ గా వ్యవహరించడమే కాకుండా డిస్ట్రిబ్యూషన్ పరంగా భారీ మద్దతు ఇచ్చిన హోంబాలే ఈ సిరీస్ లో రాబోయే మిగిలిన యానిమేషన్ సినిమాలకు ప్రొడక్షన్ పార్ట్ నర్ గా వ్యవహరించనుందట. సో కంటెంట్ లో దమ్ము ఉంటే రెండు నెలల తర్వాత ఓటిటిలో వచ్చినా ప్రేక్షకులు ఎదురు చూస్తారని చెప్పడానికి మహావతార్ నరసింహ ఒక ఉదాహరణగా నిలవడమే కాదు మార్గం కూడా చూపించింది.
This post was last modified on September 19, 2025 10:07 am
దురంధర్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. మాములుగా మంగళవారం లాంటి వీక్ డేస్…
రాజా సాబ్ నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. దర్శకుడు మారుతీ లిరికల్స్ కు పరిమితం కాకుండా ఏకంగా వీడియో…
చెల్లెలికి బర్త్డే విషెస్ చెప్పని అన్న… వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా! పాలిటిక్స్లో అది ఎవరై ఉంటారు? అని ఎవరైనా…
సినిమాల్లో కంటెంట్ ఎలా ఉందన్న దాని కంటే.. ఆ సినిమా టీంలో ముఖ్యమైన వ్యక్తుల మాటతీరును, నడవడికను బట్టి కూడా సినిమాకు ఓపెనింగ్స్…
తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే.…
అఖండ 2 తాండవంతో గత వారం గడిచిపోయాక ఇప్పుడు మూవ్ లవర్స్ చూపు కొత్త ఫ్రైడే మీదకు వెళ్తోంది. బాలయ్య…