పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సినిమా కంటే ముందు ఎదురు చూస్తున్న ఓజి ట్రైలర్ ఈ ఆదివారం ఉదయం విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం కావడంతో అభిమానుల్లో అసహనం నెలకొంది. ఇంత హైప్ ఉన్న సినిమాకు సరైన మార్కెటింగ్ చేయడం లేదని డివివి టీమ్ మీద గరం గరం అవుతున్నారు. అయితే ట్రైలర్ లో ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. ప్రీమియర్ కు వెయ్యి రూపాయలు పెట్టారు. వీరాభిమానులకు అదేం సమస్య కాదు. కానీ అంత పెట్టి చూడాల్సిందే అనే రేంజ్ లో ట్రైలర్ కంటెంట్ వదలాలి. ముఖ్యంగా దర్శకుడు సుజిత్ తన మీదున్న నమ్మకానికి పునాది ఇక్కడి నుంచే వేసుకోవాలి.
పది రోజుల పాటు ఏపీలో 150, 100 చొప్పున టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్లు ఇచ్చారు. బాగానే ఉంది. కానీ అంతేసి ధరలు పెట్టి సామాన్య ప్రేక్షకులు వెళ్లాలంటే ఓజి ట్రైలర్ ఇచ్చే ఇంప్రెషన్ చాలా ముఖ్యంగా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మార్నింగ్ షో టాక్ తేడా కొడితే సాయంత్రానికి జనాలు పల్చబడుతున్నారు. అలా కాకుండా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే నాలుగైదు రోజులు ఏపీ తెలంగాణ థియేటర్లలో టికెట్ ముక్క ఉండదు. స్టార్ హీరోలు ఉండి సినిమా బాగుందనే టాక్ వస్తే ఆడియన్స్ ధరలు లెక్క చేయరని పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం నిరూపించాయి. యునానిమస్ టాక్ తో గెలిచినవి అవి.
ఇప్పుడు ఓజికి కూడా అదే సీన్ రిపీట్ కావాలి. మొదటి రోజు దాదాపు ఎనభై శాతం థియేటర్లలో ఓజినే స్క్రీనింగ్ చేయబోతున్నారు. కొన్నింటిలో మిరాయ్ మూడో వారం అగ్రిమెంట్ ప్రకారం షోలు ఉండగా శుక్రవారం రిలీజయ్యే కొత్త సినిమాల టాక్ ని బట్టి వాటికి సెకండ్ వీక్ లో ఎన్ని కేటాయించాలనే నిర్ణయం తీసుకుంటారు. దసరా పండక్కు వారం ముందుగానే వస్తున్న ఓజి కనక సెప్టెంబర్ హిట్ సెంటిమెంట్ ని కంటిన్యూ చేస్తే అక్టోబర్ మొదటి వారం వరకు థియేటర్లను జనాలతో నింపేస్తుంది. ఇవన్నీ నెరవేరడానికి ముందు ఓజి ట్రైలర్ అట్టా ఇట్టా కాదు అదిరిపోయిందనే ఫీడ్ బ్యాక్ తెచ్చుకోవాల్సిందే.
This post was last modified on September 18, 2025 3:21 pm
మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…
ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…
యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…
అగ్గిపెట్టి మచ్చా.. సోషల్ మీడియా వాడే తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతడి…
న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…