కొన్ని నెలల క్రితం స్పిరిట్ కోసం దీపికా పదుకునేని వద్దనుకుని త్రిప్తి డిమ్రిని తీసుకోవడం పట్ల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ మీడియా హౌసెస్ కు టార్గెట్ అయ్యాడు. ఆమె డిమాండ్లను తట్టుకోలేకే వద్దనుకున్నాడని అందరికీ తెలిసినా దీపికా కొత్తగా తల్లయ్యిందనే కోణంలో తన మీద సింపతీ తెచ్చేందుకు గట్టి ప్రయత్నాలే జరిగాయి. కానీ సందీప్ వాటిని కేర్ చేయలేదు. ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా హీరోతో సినిమా చేస్తున్నప్పుడు కొన్ని విషయాల్లో హీరోయిన్ తో సహా అందరికీ రాజీ ఉండాలి. అంతే తప్ప నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు, నేను చెప్పిందే జరగాలంటే ఇదిగో ఇలాంటి రాద్ధాంతాలే జరుగుతాయి.
తాజాగా కల్కి 2 నుంచి దీపికా పదుకునేని తప్పించడం చూస్తే సందీప్ వంగ చేసింది ముమ్మాటికి రైటేనని చెప్పడంలో డౌట్లు అక్కర్లేదు. డిమాండ్లు చేయడం తప్పు కాదు. కానీ అవి గొంతెమ్మ కోరికల్లా అనిపించకూడదు. ఇప్పుడు హిందీ మీడియాలో ఇదే టాపిక్ అవుతోంది. ఆవిడ గతంలో చేసిన సినిమాల దర్శక నిర్మాతల అనుభవాలను తవ్వి తీసి మరీ వీడియోలు, ఇంటర్వ్యూల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఒకవేళ దీపికా వైపు నుంచి ఎలాంటి సమస్య లేకపోతే అదేదో స్పిరిట్ నుంచి తప్పుకున్నప్పుడే క్లారిటీ ఇవ్వాల్సింది. మౌనంగా ఉండటమే మరిన్ని అనుమానాలకు తావిచ్చేలా చేసింది.
మరి అల్లు అర్జున్ – అట్లీ మూవీకి ఈ సమస్య రాలేదా అనే డౌట్ రావడం సహజం. ఇక్కడో మెలిక ఉంది. జవాన్ టైంలోనే అట్లీ దీపికాకు తన సూపర్ హీరో సబ్జెక్టు గురించి చూచాయగా చెప్పాడట. అప్పుడే చేస్తానని మాట ఇచ్చిందట. దానికి తోడు ఇప్పుడు ఏఏ 22కి భారీ రెమ్యునరేషన్ ఇవ్వడంతో గ్రీన్ సిగ్నల్ వచ్చిందని అంటున్నారు. మరి నాగ్ అశ్విన్, సందీప్ వంగాలకు వచ్చిన ప్రాబ్లమ్ మున్ముందు అట్లీకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాకపోతే ఇష్యూ బయటికి రాదంతే. ఏది ఏమైనా తన ప్రమేయం లేని టాపిక్ లో సందీప్ రెడ్డి వంగా మరోసారి హైలైట్ అవుతున్నారు. మన దగ్గరే కాదు నార్త్ సర్కిల్స్ లో కూడా.
This post was last modified on September 18, 2025 3:31 pm
మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…
ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…
యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…
అగ్గిపెట్టి మచ్చా.. సోషల్ మీడియా వాడే తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతడి…
న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…