Movie News

ఇళయరాజా పాటలతో జాగ్రత్తగా ఉండాల్సిందే

ఇసైజ్ఞాని, మాస్ట్రో ఇళయరాజాని అభిమానించని సౌత్ ఇండియా ప్రేక్షకులు బహుశా ఉండరు. ఇంత వయసులోనూ సినిమాలకు మ్యూజిక్ కంపోజింగ్ చేయడమే కాక లైవ్ కన్సర్ట్స్ నిర్వహిస్తూ తన అభిమానులను పరవశంలో ముంచెత్తుతూనే ఉంటారు. కొత్త తరంలో ఎన్నో వందల వేల పాటలు వచ్చి ఉండొచ్చు కానీ ఇప్పటికీ జనాలు చెవి కోసుకునేది, గీతాంజలి, ప్రేమ, అభినందన లాంటి ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ కే. కేవలం పోస్టర్ లో ఈయన పేరు చూసి పబ్లిక్ నేరుగా థియేటర్లకు వెళ్లిపోయేవారంటే ఎంత ప్రభావం చూపించారో అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే ఇళయరాజా 50 వసంతాల వేడుక కూడా జరిగింది.

అయితే ఏదైనా సినిమాలో ఒక నోస్టాల్జిక్ ఫిలింగ్ రప్పించాలంటే ఇళయరాజా పాటలు, ట్యూన్స్ వాడుకోవడం ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. ఆయన అనుమతి తీసుకుని తగిన రాయల్టీ చెల్లిస్తే ఏ సమస్యా లేదు. కాదు కూడదని మ్యూజిక్ కంపెనీ పర్మిషన్ ఉంది కదా ఇంకేం అక్కర్లేదని భావిస్తే మాత్రం షాకులు తప్పవు. తాజాగా నెట్ ఫ్లిక్స్ లో అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీని తీసేశారు. తన అంగీకారం లేకుండా పాటలు వాడుకున్నారనే కేసులో ఇళయరాజా విజయం సాధించారు. టాలీవుడ్ కు చెందిన మైత్రి మూవీ మేకర్స్ దీన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. కేసులో నెక్స్ట్ ఎలా మూవ్ అవుతారనేది తర్వాత సంగతి.

ఇకపై మాత్రం దర్శకులు ఇలాంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆ మధ్య సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ ఇంట్రో కోసం అనిల్ రావిపూడి పెట్టిన కూలి నెంబర్ వన్ సాంగ్ ఇళయరాజా కంపోజింగే. ముందే ఫార్మాలిటీస్ చేసుకోవడంతో ఇబ్బంది తలెత్తలేదు. గతంలో ఎస్పి బాలసుబ్రమణ్యం పబ్లిక్ స్టేజిల మీద తన పాటలు పడకుండా కోర్ట్ స్టే దాకా వెళ్లిన ఇళయరాజా ఇప్పుడు సినిమాలను మాత్రం వదులుతారా. ఆప్త మిత్రుడికే మినహాయింపు ఇవ్వలేదు. ఈ అంశాన్ని నెగటివ్ కోణంలో చూసేవాళ్ళు కూడా లేకపోలేదు. రాజా వేసిన ముద్ర కావాలి కానీ ఆయన షరతులు మాత్రం వద్దంటే ఎలా అనేది ఫ్యాన్స్ వెర్షన్.

This post was last modified on September 17, 2025 12:17 pm

Share

Recent Posts

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

19 minutes ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

1 hour ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

2 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

3 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

5 hours ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

5 hours ago